Shruti Haasan : పవన్ కళ్యాణ్ సరసన నటించిన కాటమరాయుడు సినిమా ఫ్లాప్ తర్వాత మళ్ళీ శృతి హాసన్ టాలీవుడ్‌లో కనిపించలేదు. ఆ మాటకొస్తే అటు తమిళ ఇండస్ట్రీలోనూ సినిమాలు చేసిందీ లేదు. అలా మూడేళ్ళు గడిపోయింది. ఈ లోపు రష్మిక మందన్న, పూజా హెగ్డే, సాయి పల్లవి, కీర్తి సురేశ్ లాంటి వారొచ్చి వరుస అవకాశాలతో దూసుకెళుతున్నారు. దాంతో ఇక సినిమాలకు శృతి గుడ్‌బై చెప్పినట్టే అని అందరూ మాట్లాడుకున్నారు. కానీ, అనూహ్యంగా రవితేజ సరసన నటించిన క్రాక్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి సాలీడ్ హిట్ అందుకుంది.
ఈ సినిమా సక్సెస్ శృతిని మళ్ళీ క్షణం తీరిక లేకుండా చేసింది. మరీ ముఖ్యంగా హీరోయిన్స్ కరువైన సీనియర్ హీరోలకు మంచి జోడీగా కుదురుతోంది. అందుకే, శృతి డేట్స్ కోసం మేకర్స్ బాగానే పోటీపడుతున్నారు. ప్రస్తుతం తెలుగులోనే అమ్మడు ఎక్కువ సినిమాలు చేస్తోంది. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ సలార్. ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రభాస్ పక్కన శృతికి ఛాన్స్ వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇందులో మంచి పవర్ ఫుల్ రోల్ చేస్తోంది. సలార్ గనక హిట్ అయితే, అమ్మడు పాన్ ఇండియన్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరినట్టే.
ఇక మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మెగా 154లో ఛాన్స్ అందుకుంది. చిరు పక్కన అవకాశం కూడా ఊహించనిదే. బాబి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే నెలకొన్నాయి. ఇక తనకి క్రాక్ సినిమాతో మళ్ళీ లైఫ్ ఇచ్చిన దర్శకుడు గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తోంది. ఇందులో నందమూరి బాలకృష్ణ హీరో. అసలు బాలయ్య పక్కన శృతిని హీరోయిన్‌గా తీసుకుంటారని ఎవరైనా భావిస్తారా. ఇది కూడా షాకిచ్చే అప్‌డేటే. ఇందులో హీరోయిన్ శృతి హాసన్ అంటే కాస్త నమ్మడం కష్టం అయింది కూడా. ఏదేమైనా మొత్తానికి ఇప్పుడు శృతి సీనియర్ హీరోలకు మంచి ఛాయిస్‌గా మారింది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.