Shruti Haasan : ఆ పూలని తెచ్చి బెడ్ రూంలో పెట్టుకుంటున్న శృతి హాస‌న్.. ఎందుకంత స్పీడ్ అంటున్న నెటిజ‌న్స్

Authored By Sam C | The Telugu News | Updated on : 29 January 2022, 12:30 pm

Shruti Haasan : విల‌క్ష‌ణ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ గారాల‌ప‌ట్టిగా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయిన అందాల ముద్దుగుమ్మ శృతి హాస‌న్. తల్లిదండ్రుల నుంచి నటనను వారసత్వంగా తీసుకున్న శ్రుతి హాసన్ 2000లో బాలనటిగా వెండి తెరపై అడుగు పెట్టింది. తన తండ్రి కమల్ హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన “హే రాం” సినిమాలో బాల్యనటిగా నటించింది. 2008లో “లక్” సినిమాతో హీరోయిన్ గా వెండి తెరపై రీ ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ లో 2011లో “అనగనగా ఓ ధీరుడు” సినిమాలో నటించింది. ఈ సినిమాలోని నటనకు గాను శ్రుతి ఉత్తమ తెలుగు నూతన నటి గా దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకుంది.

గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రంతో ఓ మెరుపు మెరిసిన శృతి హాస‌న్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉంది. తన కెరియర్ ను గాడిలో పెట్టుకునే ప్రయత్నాల్లో ఉన్న ఆమెకి ‘క్రాక్’ హిట్ చాలా హెల్ప్ అయింది. ఆ తరువాత ఆమె అంగీకరించిన సినిమానే ‘సలార్. ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్న ఈ సినిమాలో శ్రుతి హాసన్ కి ఛాన్స్ దొరకడం నిజంగా ఆమె అదృష్టమే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుంది గనుక, తన కెరియర్ మరింత పుంజుకుంటుందనే బలమైన నమ్మకంతో ఆమె ఉంది. ఈ సినిమా షూటింగులో పాల్గొనడానికి ఉత్సాహాన్ని చూపుతూ వచ్చింది.

shruti haasan likes that flowers

shruti haasan likes that flowers

Shruti Haasan : అవంటే శృతి ప‌డి చ‌స్తుంద‌ట‌..!

సొంత టాలెంట్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని, నటిగా తనేంటో నిరూపించుకున్న శృతి హాసన్ తనకు ఇష్టమైన పూలు, ఫుడ్ గురించి అభిమానులతో పంచుకుంది. శృతికి రోజా పూలు,లిల్లీ పూలు అంటే చాలా ఇష్టమట. అవి ఎక్కడ కనపడిన ఖచ్చితంగా కొనుకుని తన బెడ్ రూం లో పెట్టుకుంటుందట. అలాగే ఫుడ్ విషయంలో వడ , దోశ కాంబినేషన్ అంటే పిచ్చ ఇష్టమట. రైస్ లోకి అయితే సాంబర్, రసం ఖచ్చితంగా ఉండాసిందేనట. పండ్లు విష‌యానికి వ‌స్తే సీతాఫలాలు, చెర్రీలు చాలా ఇష్టమట. శృతి హాస‌న్ అభిరుచులు విన్న నెటిజ‌న్స్ ఆశ్చ‌ర్య‌పోవ‌డంతో పాటు అమ్మ‌డు మంచి స్పీడ్ మీదుంద‌నే కామెంట్స్ పెడుతున్నారు.

Advertisement

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి