Shruti Haasan : నోరు మూసుకొని పో.. ఎక్కువ మాట్లాడితే తాట తీస్తానంటూ శృతి హాసన్ వార్నింగ్..!
Shruti Haasan : కమల్ గారాల పట్టి శృతి హాసన్ ఇప్పుడు సింగిల్. ఆమె కొద్ది రోజుల క్రితం శాంతను హాజరికాతో బ్రేకప్ చెప్పి ఇప్పుడు నెటిజన్స్‌తో చిట్ చాట్ చేస్తూ సరదాగా గడుపుతుంది. శృతి..అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి మంచి పాపులారిటీని తెచ్చుకుంది. ముఖ్యంగా పవన్ కల్యాణ్‌తో నటించిన గబ్బర్ సింగ్, మహేష్‌తో శ్రీమంతుడు సినిమాలు సూపర్ హిట్ కావడంతో శృతి హాసన్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. బాలీవుడ్‌లో కూడా ఈ భామ సందడి చేసింది. అయితే స్టార్ హీరోయిన్‌గా ఎక్కువ కాలం కొనసాగుతుందనుకున్న శృతి హాసన్ కెరీర్ గాడి తప్పింది.
దీనికి కారణం తన వ్యక్తిగత జీవితమే అంటోంది ఈ భామ. వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే మైఖేల్ కొసలే అనే వ్యక్తితో శ్రుతి హాసన్ డేటింగ్ చేసింది. పెళ్లికి ముందే ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో కాపురం కూడా పెట్టారు. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి రిలేషన్‌షిప్‌కు 2019లో తెరపడింది. విభేదాలు తలెత్తడంతో మైఖేల్ కొసలేకు శ్రుతి హాసన్ బ్రేకప్ చెప్పేసింది.ఆ తర్వాత ముంబైకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో శృతి యవ్వారం నడిపింది. ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉన్నారు. కొన్ని కారణాల వలన అతనికి బ్రేకప్ చెప్పింది. అయితే శృతి హాసన్ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో షేర్ చేస్తుంటుంది.
Shruti Haasan : నోరు మూసుకొని పో.. ఎక్కువ మాట్లాడితే తాట తీస్తానంటూ శృతి హాసన్ వార్నింగ్..!
తాజాగా అభిమానులతో ముచ్చటించిన శృతి హాసన్.. ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు తనదైనశైలిలో సమాధానం ఇచ్చింది. శృతి హాసన్‌ను ఓ నెటిజన్ సౌత్ ఇండియన్ యాసలో ఏదైనా చెప్పవా? అని అడగడం జరిగింది. ఓకే ఈ రకమైన జాతి వివక్షను అస్సలు సహించను. మమ్మల్ని చూసి ఇడ్లీ, దోస, సాంబార్.. ఇలాంటి పేర్లతో పిలిస్తే మేము ఊరుకోము. మీరు మమ్మల్ని అనుకరించలేరు. కాబట్టి మాలాగ ఉండాలని ట్రై చేయకండి. ఎలా పడితే అలా పిలిస్తే దాన్ని కామెడీగా తీసుకోము. సౌత్ ఇండియన్ భాషలో ఏదైనా చెప్పమని అడిగావు కదా.. నోరు మూసుకుని వెళ్లు” అంటూ శృతి కాస్తా ఘాటుగానే రియాక్ట్ అయింది. శృతి కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
Apple Peels : ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు ఒక యాపిల్ తినాలి అని వైద్యులు సలహా ఇస్తూనే ఉంటారు.…
Varalakshmi Kataksham : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రావణమాసానికి ఎంతో ప్రత్యేకత ఉందని చెబుతున్నారు పండితులు. ఇంకా,లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తికి…
Goji Berries : స్ట్రాబెర్రీ,చెర్రీ పండ్లు గురించి చాలామందికి తెలుసు.కానీ గోజీ బెర్రీల గురించి ఎప్పుడైనా విన్నారా... దీని గురించి…
Rakhi Festival : ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీన రాఖీ పండుగ వచ్చినది. సోదరీ సోదరీమణులు ఎంతో ఆత్మీయంగా…
Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
This website uses cookies.