Shruti Haasan : నోరు మూసుకొని పో.. ఎక్కువ మాట్లాడితే తాట తీస్తానంటూ శృతి హాస‌న్ వార్నింగ్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Shruti Haasan : నోరు మూసుకొని పో.. ఎక్కువ మాట్లాడితే తాట తీస్తానంటూ శృతి హాస‌న్ వార్నింగ్..!

Shruti Haasan : క‌మ‌ల్ గారాల ప‌ట్టి శృతి హాస‌న్ ఇప్పుడు సింగిల్‌. ఆమె కొద్ది రోజుల క్రితం శాంత‌ను హాజ‌రికాతో బ్రేక‌ప్ చెప్పి ఇప్పుడు నెటిజన్స్‌తో చిట్ చాట్ చేస్తూ స‌ర‌దాగా గ‌డుపుతుంది. శృతి..అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి మంచి పాపులారిటీని తెచ్చుకుంది. ముఖ్యంగా పవన్ కల్యాణ్‌తో నటించిన గబ్బర్ సింగ్, మహేష్‌తో శ్రీమంతుడు సినిమాలు సూపర్ హిట్ కావ‌డంతో శృతి హాస‌న్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. […]

 Authored By ramu | The Telugu News | Updated on :22 June 2024,8:30 pm

Shruti Haasan : క‌మ‌ల్ గారాల ప‌ట్టి శృతి హాస‌న్ ఇప్పుడు సింగిల్‌. ఆమె కొద్ది రోజుల క్రితం శాంత‌ను హాజ‌రికాతో బ్రేక‌ప్ చెప్పి ఇప్పుడు నెటిజన్స్‌తో చిట్ చాట్ చేస్తూ స‌ర‌దాగా గ‌డుపుతుంది. శృతి..అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి మంచి పాపులారిటీని తెచ్చుకుంది. ముఖ్యంగా పవన్ కల్యాణ్‌తో నటించిన గబ్బర్ సింగ్, మహేష్‌తో శ్రీమంతుడు సినిమాలు సూపర్ హిట్ కావ‌డంతో శృతి హాస‌న్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. బాలీవుడ్‌లో కూడా ఈ భామ సంద‌డి చేసింది. అయితే స్టార్ హీరోయిన్‌గా ఎక్కువ కాలం కొనసాగుతుందనుకున్న శృతి హాసన్ కెరీర్ గాడి తప్పింది.

Shruti Haasan శృతి ఫైర్..

దీనికి కారణం తన వ్యక్తిగత జీవితమే అంటోంది ఈ భామ. వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే మైఖేల్ కొసలే అనే వ్యక్తితో శ్రుతి హాసన్ డేటింగ్ చేసింది. పెళ్లికి ముందే ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో కాపురం కూడా పెట్టారు. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి రిలేషన్‌షిప్‌‌కు 2019లో తెరపడింది. విభేదాలు తలెత్తడంతో మైఖేల్ కొసలే‌కు శ్రుతి హాసన్ బ్రేకప్ చెప్పేసింది.ఆ త‌ర్వాత ముంబైకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో శృతి య‌వ్వారం న‌డిపింది. ఇద్ద‌రు క‌లిసి ఒకే ఇంట్లో ఉన్నారు. కొన్ని కార‌ణాల వ‌ల‌న అతనికి బ్రేకప్ చెప్పింది. అయితే శృతి హాసన్ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో షేర్ చేస్తుంటుంది.

Shruti Haasan నోరు మూసుకొని పో ఎక్కువ మాట్లాడితే తాట తీస్తానంటూ శృతి హాస‌న్ వార్నింగ్

Shruti Haasan : నోరు మూసుకొని పో.. ఎక్కువ మాట్లాడితే తాట తీస్తానంటూ శృతి హాస‌న్ వార్నింగ్..!

తాజాగా అభిమానులతో ముచ్చటించిన శృతి హాసన్.. ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు తనదైనశైలిలో సమాధానం ఇచ్చింది. శృతి హాసన్‌ను ఓ నెటిజన్ సౌత్ ఇండియన్ యాసలో ఏదైనా చెప్పవా? అని అడగడం జరిగింది. ఓకే ఈ రకమైన జాతి వివక్షను అస్సలు సహించను. మమ్మల్ని చూసి ఇడ్లీ, దోస, సాంబార్.. ఇలాంటి పేర్లతో పిలిస్తే మేము ఊరుకోము. మీరు మమ్మల్ని అనుకరించలేరు. కాబట్టి మాలాగ ఉండాలని ట్రై చేయకండి. ఎలా పడితే అలా పిలిస్తే దాన్ని కామెడీగా తీసుకోము. సౌత్ ఇండియన్ భాషలో ఏదైనా చెప్పమని అడిగావు కదా.. నోరు మూసుకుని వెళ్లు” అంటూ శృతి కాస్తా ఘాటుగానే రియాక్ట్ అయింది. శృతి కామెంట్స్ ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది