Shweta Basu Prasad : శ్వేతా బసు ప్రసాద్ ఏంటి ఇలా తయారైంది… గుర్తు పట్టలేనంతగా ఎలా మారిపోయిందో చూడండి
Shweta Basu Prasad : శ్వేతా బసు ప్రసాద్ పేరు వినగానే మనకు గుర్తొచ్చే సినిమా కొత్త బంగారు లోకం. ఆ సినిమాతో తను ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఎకడా… అంటూ తను క్యూట్ వాయిస్ తో ఆ సినిమాలో మాట్లాడి కుర్రాళ్లను ఫిదా చేసింది. నిజానికి తన తొలి సినిమానే కొత్త బంగారు లోకం. ఆ సినిమాతో కుర్రాళ్ల కలల రాణిగా ముద్రపడిపోయింది శ్వేతాబసు ప్రసాద్ కు. ఆ తర్వాత తనకు సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. కానీ.. ఏ సినిమా అంతగా ఆడలేదు. తన మీద పలు ఆరోపణలు కూడా రావడంతో తన సినిమా కెరీర్ దాదాపుగా ఎండ్ అయినంత పని అయింది.
ఆ తర్వాత ఇప్పుడిప్పుడే తను వెబ్ సిరీస్ లు గట్రా చేస్తోంది. బాలీవుడ్ లో సీరియల్స్, సినిమాల్లోనూ నటిస్తోంది. ఇప్పుడిప్పుడే తన సినిమా కెరీర్ గాడిన పడుతోంది. తనకు పెళ్లి కూడా అయింది కానీ.. పెళ్లి అయిన సంవత్సరానికి విడాకులు తీసుకుంది. ప్రస్తుతం తను కేవలం సినిమాల మీదనే దృష్టి పెట్టింది. అయితే.. ఇటీవల తన బర్త్ డే సందర్భంగా తన ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేసింది శ్వేతా. తన బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. దానికి సంబంధించిన ఫోటోలను శ్వేతా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Shweta Basu Prasad : ముక్కుకు ఏమైనా సర్జరీ చేయించుకుందా?
శ్వేతా బసు ప్రసాద్ ఒకప్పటి శ్వేతలా లేదు. తన ముక్కుకు సర్జరీ అయినట్టుంది. చాలా దారుణంగా తయారైంది. ఒకప్పుడు కొత్త బంగారు లోకం సినిమాలో తను ఎంత చబ్బీగా ఉండేది. ఇప్పుడు చూస్తే తనను ఎవ్వరూ గుర్తు పట్టలేరు కూడా. అలా తయారైంది. తన బర్త్ డే వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ ఫోటోలు వైరల్ అవడంతో ఇప్పుడు అందరూ తనను చూస్తున్నారు. అసలు శ్వేతా ఏంటి ఇలా తయారైందంటూ ఆశ్చర్యపోతున్నారు.