Shweta Basu Prasad : శ్వేతా బసు కెరియర్ నాశనం చేసింది ఆ స్టార్ హీరోయినా?
Shweta Basu Prasad : శ్వేతా బసు ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొత్త బంగారు లోకం చిత్రంలో కథానాయికగా నటించి అందరి మెప్పు పొందింది శ్వేతా బసు. ఈ సినిమా తర్వాత కొన్ని సినిమాలు చేసింది కానీ పెద్దగా గుర్తింపు మాత్రం తెచ్చుకోలేదు. ఆ తర్వాత అనుకోకుండా సెక్స్ రాకెట్‌లో ఈమె కూడా పట్టుబడటం సంచలనంగా మారింది. ఆ వెంటనే బాలీవుడ్ వెళ్లి అక్కడ సినిమాలు చేసుకుంది శ్వేతా బసు ప్రసాద్. రెండేళ్ళ కింద దర్శకుడు రోహిత్ మిట్టల్‌ను పెళ్లి చేసుకుంది శ్వేతా. అంతా సవ్యంగా సాగుతుంది అనుకుంటున్న సమయంలోనే విడాకులు తీసుకుంది.
తమ బంధం కేవలం 8 నెలల్లోనే ముగిసిపోతుందని కలలో కూడా అనుకోలేదని.. కానీ ఊహించనిదే జీవితం అని చెప్పుకొచ్చింది శ్వేతా బసు ప్రసాద్. కెరీర్ మొదట్లో మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన శ్వేతా బసు ఫేమ్ ను అలాగే కంటిన్యూ చేయలేకపోయింది. సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో ఈ అమ్మడు ఆఫర్లను కోల్పోయింది. దీంతో కనీసం కుటుంబం గడవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులను ఎదుర్కొంది. దీంతో ఎలాగైనా మళ్లీ ఇండస్ట్రీ లో నిలదొక్కుకోవాలని అనుకున్నప్పటికీ అవకాశాలు మాత్రం తలుపు తట్టలేదు. దాంతో అలాగే కొనసాగితే కెరియర్ ముగిసిపోతుందని భావించి కుటుంబ పోషణ కోసం వ్యభిచారము నిర్వహిస్తూ పోలీసులకు చిక్కింది.

Shweta Basu Prasad gets struggles
Shweta Basu Prasad : అలా జరిగిందా?
పోలీసులకు చిక్కిన రోజున తనతో పాటూ టాలీవుడ్ సినీ పరిశ్రమ కి చెందిన ఓ సీనియర్ నటి కూడా ఉందట. కానీ అప్పటికే ఆ సీనియర్ నటికి ఇండస్ట్రీ లో మరియు రాజకీయాలలో పలువురు ప్రముఖ వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు అలాగే పరిచయాలు ఉండటంతో తన పేరు బయటికి రాకుండా గుట్టు చప్పుడు కాకుండా తప్పించుకుందని కొందరు చర్చించుకుంటున్నారు. ఆ స్టార్ హీరోయిన్ వల్లనే శ్వేతా బసు కెరీర్ కూడా నాశనం అయి ఉంటుందని కొందరు అభిమానులు చర్చించుకుంటున్నారు. ఏదేమైన తన కెరీర్ సాఫీగా సాగుతున్న సమయంలో శ్వేతా బసు తీసుకున్న నిర్ణయం ఆమె కెరీర్‌ని దారుణంగా దెబ్బ తీసింది.