Shyamala : వారసుడు కొడుకే అవుతాడా..? కూతుర్లు కారా..? మెగాస్టార్‌కి శ్యామల కౌంటర్..!
ప్రధానాంశాలు:
Shyamala : వారసుడు కొడుకే అవుతాడా..? కూతుర్లు కారా..? మెగాస్టార్‌కి శ్యామల కౌంటర్..!
Shyamala : మెగాస్టార్ చిరంజీవి Megastar Chiranjeevi తనకు మనవడు ఉంటే బాగుండు అంటూ తన మనసులోని కోరికను బయట పెట్టారు. తన ఇద్దరు కూతుర్లకు ఇద్దరు చొప్పున నలుగురు కుమార్తెలు, తనయుడు రామ్ చరణ్‌కి కూతురు క్లింకార ఉన్న విషయం తెలిసిందే. దాంతో చిరంజీవి Chiranjeevi ఫ్యామిలీలో మొత్తం అమ్మాయిలే ఉన్నారు. రామ్ చరణ్ తర్వాత కొణిదెల వారసత్వంను, చిరంజీవి లెగస్సీని కొనసాగించే వారసుడు ప్రస్తుతానికి లేడు. మెగా ఫ్యాన్స్ అదే విషయమై ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. కానీ ఇప్పటి వరకు చిరంజీవి లేదా రామ్ చరణ్ ఎప్పుడూ తమ ఫ్యామిలీలో వారసుడు లేడు అనే మాటలు మాట్లాడలేదు. కానీ మొదటి సారి మెగాస్టార్ చిరంజీవి తనకు మనవడు ఉంటే బాగుండు అన్నారు. ఇంట్లో మొత్తం అమ్మాయిలే ఉన్నారు, ఒక అబ్బాయి కావాలని కోరుకుంటున్నట్లు చిరంజీవి మనసులో మాట బయట పెట్టారు….
![Shyamala వారసుడు కొడుకే అవుతాడా కూతుర్లు కారా మెగాస్టార్‌కి శ్యామల కౌంటర్](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/Shyamala.jpg)
Shyamala : వారసుడు కొడుకే అవుతాడా..? కూతుర్లు కారా..? మెగాస్టార్‌కి శ్యామల కౌంటర్..!
మెగాస్టార్‌కి శ్యామల కౌంటర్
అయితే మెగాస్టార్ వ్యాఖ్యలపై వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల YCP official spokesperson Shyamala స్పందిస్తూ.. వారసుడు కొడుకే అవుతాడా? కూతురు కాదా? అని ప్రశ్నించారు. మెగాస్టార్ చిరంజీవి ఏ ఉద్దేశ్యంతో అన్నారో తనకు తెలియదన్నారు. వారసుడు అనేవాళ్లు కొడుకు అనే ఉద్దేశ్యంలో నుంచి బయటకు వస్తే బాగుంటుందని హితవు పలికారు. మహిళలు అభివృద్ధి చెంది ముందుకు వెళ్తున్నారని, ఉపాసన అన్నీ వ్యాపారాలు చక్కగా నడుతున్నట్లు తెలిపారు. వారసులు అంటే కొడుకే కానక్కరలేదన్నారు.
ఒక్కరి వ్యాఖ్యల వల్ల సినిమా పరిశ్రమ దెబ్బతినకూడదన్నారు శ్యామల Shyamala అన్నారు. చిరంజీవి వ్యాఖ్యల వల్ల కొందరికి కోపం వచ్చిందని, సినిమా చూడం అంటున్నారని.. దానివల్ల నిర్మాతకు నష్టం కదా? అని ఆమె ప్రశ్నించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు రక్షణ కరువైందన్నారు.. విద్యార్ధులకు ఇచ్చే పథకాలు ఆపేసి వారి జీవితాలతో ఆడుకుంటున్నారన్నారు.