Tillu Square Movie : అందాల ముద్దుగుమ్మ అనుపమ రేపు టిల్లు స్క్వేర్ అనే చిత్రంతో ప్రేక్షకులని పలకరించనుంది. సిద్ధు, అనుపమ ప్రధాన పాత్రలో రూపొందనున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.అయితే ఈ సినిమాలో ఎప్పుడు లేని విధంగా అనుపమ మరింత డోసు పెంచి ముద్దులతో, రొమాన్స్ తో రెచ్చిపోయినట్టు టీజర్, ట్రైలర్‌ని చూస్తే అర్ధమైంది. వీటిలోనే ఇంత హాట్ నెస్ తో అదరగొడితే సినిమాలో ఇంకే రేంజ్ లో చేసిందో అనుకుంటున్నారు. అయితే మార్చి 29న చిత్రం రిలీజ్ కానుండగా, మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఇక ప్రమోషన్స్ లో అనుపమ ఎక్కడికి వెళ్లినా ముందు ఈ రొమాన్స్ గురించే ఆమెకి ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
ఇటీవల జరిగిన ప్రెస్‌మీట్ లో రొమాన్స్ గురించి ప్రశ్న ఎదురు కాగా, దానికి సమాధానంగా రెగ్యులర్ క్యారెక్టర్స్ చేసి బోర్ కొట్టేసింది, ఈ పాత్ర నాకు నచ్చింది, ఇలాంటివి కూడా చేయాలి, అందుకే చేశాను అని చెప్పుకొచ్చింది. ఇక తాజా ఇంటర్వ్యూలో రొమాన్స్ గురించి యాంకర్ అడగగా, దానికి సమాధానం ఇచ్చిన అనుపమ.. రొమాన్స్ చేయడం అంత ఈజీ కాదు. ఇద్దరు ఇంటిమెంట్ గా ఉన్నది ప్రైవేట్ మూమెంట్. కానీ 100 మంది చుట్టూ ఉండగా, సెట్ యూనిట్ ముందు సీన్ చేయడం అంటే చాలా కష్టంతో కూడుకుంది. సినిమాలో కార్ సీన్ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. కాని ఆ సమయంలో నేను నరకం అనుభవించాను అని అనుపమ చెప్పుకొచ్చింది.
అందు కార్ సీన్ గురించి మాట్లాడుతున్నారు. కాని ఆ సమయంలో చాలా ఇబ్బందిగా ఫీలయ్యాను. నా రెండు కాళ్లకి దెబ్బలు తగలడం వలన అన్ కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యాను. దాంట్లోంచి బయటకి రావడం చాలా కష్టం. అయినా అలాంటి పరిస్థితుల్లో మనం బాగా యాక్ట్ చేయాలి, రొమాన్స్ ఎంజాయ్ చేసినట్టు నటించాలి, సీన్ ని పండించాలి, ఆడియన్స్ ని మెప్పించాలి అంటే అంత ఆషామాషీ కాదు. రొమాన్స్ సీన్స్ షూట్ చేసేటప్పుడు నటీనటులు ఎంత ఇబ్బందిపడతారో మాకే తెలుసు అని అనుపమ స్పష్టం చేసింది. ప్రస్తుతం అనుపమ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.అనుపమ రానున్న రోజులలో కూడా ఈ రేంజ్‌లోనే రెచ్చిపోతుందా లేకుంటే పద్ధతిగా సినిమాలు చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.