Siddharth : కోలీవుడ్ హీరో సిద్ధార్థ్.. హీరోయిన్ అదితి రావ్ హైదరీకి మహా సముద్రం సినిమా సమయంలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి వరకు వెళుతుంది. ఇటీవల ఈ జంట తెలంగాణలోని వనపర్తిలో శ్రీరంగనాయక ఆలయంలో అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే అందరు వారు పెళ్లి చేసుకున్నారని భావించారు. కాని ఆ తర్వాత తమకు పెళ్లి కాలేదని.. కేవలం నిశ్చితార్థం మాత్రమే జరిగిందంటూ రింగ్ ఫోటోస్ షేర్ చేశారు. అదితితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. “ఆమె ఎస్ చెప్పింది.. ఎంగేజ్డ్” అంటూ సిద్ధార్థ్ పోస్ట్ చేయగా, ఇక సిద్దార్థ్ తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ “అతడు ఎస్ చెప్పాడు.. ఎంగేజ్డ్” అంటూ అదితి పోస్ట్ చేసింది. దాంతో వారిద్దరికి నిశ్చితార్థం జరగిందని, అతి త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్టు అనుకుంటున్నారు.
ఎంగేజ్‌మెంట్ తర్వాత ఎక్కడ కూడా కనిపించని సిద్ధార్థ్- అదితి తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. ఎంగేజ్‌మెంట్ తర్వాత ఈ జంట తొలిసారి ఓ ఈవెంట్‌కు హాజరయ్యారు. సిద్ధార్థ్-ఆదితిలు జంటగా కెమెరాలకు ఫోజులు ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ జంట క్యూట్‌గా ఉందని వీరు ఎన్నాళ్లు కలిసి ఉంటారో చూద్దామని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు వీరిద్దరు పెళ్లి చేసుకుంటే సిద్ధార్థ్‌కి మూడో పెళ్లి అవుతుంది, అదితికి రెండో వివాహం అవుతుంది. కొంత కాలంగా సీక్రెట్ రిలేషన్‌లో ఉన్న ఈ జంట ఏనాడు తమ ప్రేమ వ్యవహారాన్ని బయట పెట్టలేదు.
జంటగా కెమెరాకు చిక్కినప్పుడల్లా తప్పించుకునేవారు. ఇక వేకేషన్‌కు వెళ్లిన విడిగా విడిగా ఎయిర్‌పోర్టులో దర్శనం ఇచ్చేవారు. వీరిద్దరు ఎప్పుడెప్పుడు ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేస్తారా? అని ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా చూస్తున్న క్రమంలో సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకుని షాకిచ్చారు. పెళ్లి మరో రెండు మూడు నెలలో ఉండొచ్చనే టాక్ వినిపిస్తుంది. ఇక సిద్ధార్థ్ తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో నటించాడు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, ఓయ్, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, చుక్కల్లో చంద్రుడు వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. సమంతతో కూడా కొన్నాళ్లు ప్రేమాయణం నడిపించి బ్రేకప్ చెప్పాడు.
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
This website uses cookies.