Silk Smitha : స్టార్ హీరో క‌నుక ఫోన్ ఎత్తి ఉంటే సిల్క్ స్మిత బ్ర‌తికి ఉండేదేమో..!

Authored By Sam C | The Telugu News | Published on: August 31, 2022, 4:20 pm

Silk Smitha : వెండితెర‌పై గ్లామ‌ర్ ఇమేజ్ సొంతం చేసుకున్న‌న‌టి సిల్క్ స్మిత‌. నటన, అందంతో పాటు తన డ్యాన్స్‌లతో అభిమానులను అలరించిన ఈ బ్యూటీ అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించిన విషయం తెలిసిందే. సిల్క్ స్మిత ఆత్మహత్య సినీ ప్రపంచానికి పెద్ద షాక్ ఇచ్చింది. 200పైగా తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ చిత్రాలలో నటించిన సిల్క్ స్మిత హఠాన్మరణం అనేకమంది సినీ ప్రముఖులకు షాక్ ఇచ్చింది. అనేక సినిమాలలో సిల్క్ ప్రత్యేక గీతాలు, శృంగార నృత్యాలు అమెకు ఎక్కడలేని క్రేజ్ తెచ్చి పెట్టాయి. తెలుగులో “బావలు సయ్యా, మరదలు సయ్యా” పాట ఇప్పటికే హాట్ హాట్ సాంగ్ అనే చెప్పాలి.సినిమాల‌లోకి వ‌చ్చిన కొత్త‌లో సిల్క్ మేక‌ప్ ఆర్టిస్ట్ గా ప‌నిచేసేది.

ఆ కాల్ వ‌ల్ల‌నే ఇంత జ‌రిగిందా?

silksmitha death due to phone call

silksmitha death due to phone call

ఆమెను చూసి ఓ ద‌ర్శ‌కుడి భార్య చాలా అందంగా ఉందని చెప్ప‌డంతో సైడ్ డ్యాన్స‌ర్ గా అవ‌కాశం అందుకుంది. ఆ త‌ర‌వాత త‌న లుక్స్ తో మ‌గవాళ్ల‌కు మ‌త్తెక్కించ‌డంతో వ‌రుస ఆఫ‌ర్ ల‌ను అందుకుంది. స్టార్ హీరోలు సైతం త‌న డేట్స్ కోసం వేచి చూసే స్థాయికి సిల్క్ స్మిత ఎదిగింది. అవ‌కాశాలు త‌గ్గుముఖం ప‌ట్టడం అయినవాళ్లే మోసం చేయ‌డంతో చివ‌రికి డిప్రెష‌న్ లోకి వెళ్లిపోయింది. త‌న‌ను ఓ వ్య‌క్తి మోసం చేశాడంటూ సిల్క్ చివ‌రికి లెట‌ర్ రాసి ఆత్మ‌హ‌త్య చేసుకుని ఈ లోకానికి దూరం అయ్యింది. క‌న్న‌డ స్టార్ హీరో రవిచంద్ర‌న్, సిల్క్ మంచి స్నేహితులు. వీరిద్ద‌రూ క‌లిసి మొద‌టిసారి హ‌ల్లి మేస్త్రు అనే సినిమాలో న‌టించారు.

సిల్క్ త‌న జీవితంలోని అన్ని విష‌యాల‌ను త‌న‌తో పంచుకునేద‌ని రవిచంద్ర‌న్ ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు. చనిపోయే ముందురోజు కూడా సిల్క్ త‌న‌కు ఫోన్ చేసింద‌ని ర‌విచంద్ర‌న్ తెలిపారు. కానీ తాను సినిమా షూటింగ్ లో బిజీగా ఉండ‌టం వ‌ల్ల ఫోన్ లిఫ్ట్ చేయ‌లేక‌పోయాన‌ని చెప్పారు. మామూలు కాల్ అనుకుని తాను తిరిగి ఫోన్ కూడా చేయ‌లేద‌ని అన్నారు.తాను ఫోన్ లిఫ్ట్ చేసి ఉంటే సిల్క్ స్మిత బ్ర‌తికి ఉండేదేమో అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.1996 సెప్టెంబర్ 23 న, స్మిత తన చెన్నై అపార్ట్మెంట్లో చనిపోయింది. అయితే ఇందుకు అనేక కారణాలు ఉన్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఆమె ప్రేమ వ్యవహారాలు విఫలమైనట్లూ, చిత్ర నిర్మాణ ప్రయత్నంలో పెద్ద పెట్టున నష్టాల పాలైనట్లు వార్తలు వచ్చాయి. వాటికి తోడు మద్యపానం కూడా ఆమెను బలి తీసుకుందని అన్నవారు కూడా లేకపోలేదు

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp