Actress : తండ్రితో ఎఫైర్, కొడుకుతో వివాహానికి రెడీ.. తెలుగు హీరోయిన్ సంచలనం
ప్రధానాంశాలు:
Silk Smitha : తండ్రితో ఎఫైర్, కొడుకుతో వివాహానికి రెడీ.. తెలుగు హీరోయిన్ సంచలనం
Actress : సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో-హీరోయిన్లు, హీరోయిన్లు-డైరెక్టర్ల మధ్య ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి. దక్షిణాది చిత్రపరిశ్రమలతో పోలిస్తే బాలీవుడ్ లో ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. అయితే మన దక్షిణాదిలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ తండ్రితో ఎఫైర్ నడిపి, కొడుకుని వివాహం చేసుకోవడానికి రెడీ అయింది. ఆ హీరోయినే అలనాటి కైపు కండ్ల సొగసరి, నటి సిల్క్ స్మిత. 1980ల్లో సిల్క్ స్మిత పేరు ఓ సంచలనం. స్టార్ హీరోలకు ధీటుగా ఆమె క్రేజ్ ఉండేది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో 200 కంటే పైగా చిత్రాలలో నటించింది. స్మిత జీవితం, మరణం కూడా ఒక థ్రిల్లర్ సినిమాలాగే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో విజయలక్ష్మిగా జన్మించిన ఆమె పేదరికం కారణంగా నాల్గవ తరగతి చదువు మానేయాల్సి వచ్చింది. పద్నాలుగేళ్ల వయసులోనే వివాహం చేసుకుంది. కానీ ఆమె గృహ హింసకు గురైంది. ఆమె వివాహం త్వరలోనే ముగిసింది.

Actress : తండ్రితో ఎఫైర్, కొడుకుతో వివాహానికి రెడీ.. తెలుగు హీరోయిన్ సంచలనం
రాధాకృష్ణ అనే వ్యక్తితో ప్రేమలో
ఆమె 1980 – 1990లలో దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో ఒక ప్రముఖ నటిగా ఎదిగింది. ఇదే సమయంలో ఆమె వ్యక్తిగత జీవితంతో కూడా ఆమె వార్తల్లో నిలిచింది. సిల్క్ స్మిత రాధాకృష్ణ అనే వ్యక్తితో ప్రేమలో పడిందని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. డాక్టర్‌గా ఉన్న రాధాకృష్ణ స్మితకు సంబంధించిన వ్యవహారాలన్నీ చూసుకునేవారు. తనకు తెలిసిన వ్యక్తి, దగ్గరి ఊరు అనే భావనతో ఆయన్ని సిల్క్ స్మిత తన దగ్గరే పెట్టుకుంది. కానీ అతను సిల్క్ స్మిత డబ్బు మొత్తం కాజేసేవాడట.
అయితే రాధాకృష్ణ కొడుకుని పెళ్లి చేసుకుని ,పిల్లలను కనాలని, తనకంటూ ఓ ఫ్యామిలీని ఉండాలని బావించారట సిల్క్ స్మిత.దీనికి రాధాకృష్ణ అడ్డు పడటంతో గొడవలు ప్రారంభమయ్యాయని, చివరికి ఆమె ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని సిల్క్ స్మిత సన్నిహితురాలు, సినీ నటి జయశీల ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆమె 1996 సెప్టెంబర్ 23న చెన్నైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకుంది.