Chinmayi ; సింగర్ చిన్మయి మొత్తానికి తల్లైంది. రాహుల్ రవీంద్రన్, చిన్మయిల వివాహాం జరిగి దాదాపు ఎనిమిదేళ్లు అవుతోంది. మొత్తానికి వారింట్లో సంబరాలు అంబరాన్నంటాయి. కవల పిల్లలకు చిన్మయి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని చిన్మయి, రాహుల్ ఇద్దరూ సోషల్ మీడియా ద్వారాప్రకటించారు. ఇద్దరూ ఒకే మెసెజ్ చేశారు. తమ పిల్లల పేర్లు కూడా చెప్పేశారు. అయితే సింగర్ చిన్మయి గర్భవతి అన్న విషయం మాత్రం ఇంత వరకు ఎక్కడా కూడా ప్రకటించలేదు. ఇలా నేరుగా తల్లైందన్న విషయాన్నే చెప్పేశారు. మామూలుగా అయితే గర్భవతి అయినట్టుగా చెబుతుంటారు..
బేబీ బంప్ ఫోటో షూట్లు చేయాలి.. నానా హంగామా చేశాక.. గానీ పిల్లలు పుట్టారని చెప్పరు. కానీ చిన్మయి మాత్రం అవేమీ లేకుండా.. నేరుగా పిల్లలు పుట్టేశారని చెప్పేసింది. అంటే చిన్మయి మాత్రం ఫుల్ సీక్రసీ మెయింటైన్ చేసిందన్న మాట. మొత్తానికి పిల్లల పేర్లు కూడా పెట్టేసుకుని ఇలా నెట్టింట్లో ప్రకటించేసింది. ద్రిప్టా, శ్రావాస్ అంటూ పేర్లు కూడా చెప్పేసింది. అయితే అందరూ తనకు పర్సనల్‌గా మెసెజ్‌లు పెడుతున్నారు.. కానీ ఇన్ స్టా నా మీద బ్యాన్ ఇంకా ఎత్తేయలేదు.. అందుకే అందరికీ రిప్లైలు ఇవ్వలేకపోతోన్నా.. క్షమించండి అని కోరింది. సరోగసి ద్వారా కన్నావా? అంటూ అందరూ మెసెజ్‌లు చేస్తున్నారు..
ఎందుకంటే నేను తల్లిని అయినట్టు ప్రకటించలేదు.. బేబీ బంప్ పిక్స్ పెట్టలేదు.. ఎందుకంటే నేను నా వ్యక్తిగత జీవితాన్ని పర్సనల్‌గానే ఉంచాలని భావించాను.. నా ప్రెగ్నెన్సీ గురించి నాకు దగ్గరగా ఉన్న సన్నిహితులకు మాత్రమే తెలుసు.. మీరు ఎక్కువగా ఆలోచించకండి.. నా బిడ్డల గురించి ప్రార్థించండి.. వారి ఫోటోలను దాదాపుగా పెట్టను.. వారి ఫోటోలను సోషల్ మీడియాలో ఈ మధ్య షేర్ చేయను అంటూ చిన్మయి చెప్పుకొచ్చింది. మొత్తానికి చిన్మయి, రాహుల్ మాత్రం ఇప్పుడు గాల్లో తేలిపోతోన్నారు. కవల పిల్లల్లో ఒకరు అమ్మాయి, అబ్బాయి అంటా. చిన్మయి ఇప్పుడు అంతగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందా? లేదా? అన్నది చూడాలి. ఇక చిన్మయి తల్లి కావడంతో నెట్టింట్లో సెలెబ్రిటిలు విషెస్‌లు చెబుతున్నారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.