Janaki Kalaganaledu 22 June Today Episode : ఇంటర్వ్యూలో జ్ఞానాంబను పొగిడిన రామా, గుడికి వెళ్లిన జ్ఞానాంబ ఫ్యామిలీకి అనుకోని షాక్

Janaki Kalaganaledu 22 June Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 22 జూన్ 2022, బుధవారం ఎపిసోడ్ 328 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇంటర్వ్యూ అనే సరికి.. జ్ఞానాంబ కూడా కొంచెం టెన్షన్ పడుతుంది. ఇంతలో అక్కడికొచ్చిన జానకి.. మీరు భయపడటం ఏంటి అంటూ తనకు భరోసా ఇస్తుంది. మీరు ఎప్పటిలాగానే హుందాగా ఉండండి అంటుంది. మరోవైపు ఇంటర్వ్యూ అనేసరికి మల్లిక బాగా రెడీ అవుతుంది. తనను చూసి విష్ణు సెటైర్ వేస్తాడు. దీంతో తనకు కౌంటర్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది మల్లిక. ఆ తర్వాత ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది. అత్తయ్య గారు మీరు కంగారు పడితే ఆయన కూడా కంగారు పడతారు. మీరు ధైర్యంగా ఉండండి అంటుంది జానకి. రామచంద్ర గారు ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా అని అంటుంది యాంకర్. దీంతో వన్ సెకండ్ అంటుంది మల్లిక. ఎవరండి మీరు అని అడుగుతుంది యాంకర్. దీంతో నేను పేరుకు చిన్నకోడులను.. కానీ ఈ ఇంటికి నేను అసలు సిసలు కోడలును అంటుంది.

janaki kalaganaledu 22 june 2022 full episode

ఆ తర్వాత ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది. మీ అమ్మ గారి దగ్గర మీరు నేర్చుకున్న వంటనే మీ గెలుపునకు కారణం అన్నారు కదా అని అడుగుతుంది. దీంతో రామా చెప్పబోయేలోపో మల్లిక మాట్లాడుతుంది. పోటీలకు వెళ్లే ముందు నేను బావ గారికి కొన్ని టిప్స్ ఇచ్చాను అంటుంది మల్లిక. ఆ తర్వాత మల్లిక నువ్వు నోరుమూసుకుంటావా అని జ్ఞానాంబ బెదిరిస్తుంది. మీరు చెప్పండి అంటుంది యాంకర్. దీంతో అవునండి.. మా అమ్మ నేర్పించిన వంటలే నన్ను ఈ పోటీల్లో గెలిపించాయి అంటాడు. మా అమ్మే లేకపోతే నాకు ఈ గెలుపే లేదు అంటాడు. తర్వాత జానకి గురించి చెబుతాడు. ఇంటర్వ్యూ పూర్తవుతుంది.

రామచంద్ర గారు.. ఈ ఇంటర్వ్యూ అంతా గమనించాక పర్సనల్ గా మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను.. ఒక తల్లిగా మీ అమ్మ ఎంత అండూ.. ఒక భార్యగా మీ భార్యగారు అంతే అండ అంటూ చెబుతుంది యాంకర్. సరే అంటాడు రామా. ఒక మాటలో చెప్పాలంటే తను మిమ్మల్ని ఒక శిల్పంలా మార్చింది. తను పక్కనుంటే మీరు ఇలాంటి విజయాలు ఎన్నైనా సాధిస్తారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు.

Janaki Kalaganaledu 22 June Today Episode : సంతోషంలో రామా, జానకి

మరోవైపు రాత్రి అవుతుంది. జానకి చాలా సంతోషంగా ఉంటుంది. ఇంతలో రామా వస్తాడు. ఏంటండి ఆలోచిస్తున్నారు అని అడుగుతాడు రామా. దీంతో మీ గురించే అంటుంది జానకి. మీ గురించి నాకు ఇప్పుడు చాలా సంతోషం వేస్తోంది. మీ గెలుపును చూసి మామయ్య గారు కూడా గర్వంతో పొంగిపోతున్నారు. ఆ కన్నబాబు కుట్రకు మన స్వీటు షాపు చేజారిపోకుండా కాపాడుకున్నాం అంటుంది జానకి.

దీంతో ఇది నాది కాదండి.. ఇది మనందరి గెలుపు అంటాడు రామా. ఏదో ఒక విధంగా అమ్మను ఒప్పించడం కోసం మీరు ప్రయత్నాలు చేశారు. మీరు లేకపోతే నేను ఆ వంటల పోటీలకు వెళ్లి ఉండేవాడినే కాదు. ఇలా గెలిచి అమ్మ వాళ్ల సంతోషాన్ని చూసి ఉండేవాడిని కాదు అంటాడు రామా.

జానకి గారు.. నా గెలుపు కోసం కంగారు పడి మీ చదువును పక్కన పెట్టారు.. అని బుక్స్ ను తన చేతుల్లో పెడతాడు. దీంతో ఈరోజు మీ గెలుపునే పంచుకుందాం. రేపటి నుంచి చదువు కొనసాగిస్తా అంటుంది జానకి. తర్వాత మంచం మీద ఇద్దరూ సరదాగా కాసేపు గడుపుతారు.

తర్వాత రామా ఒడిలో హాయిగా నిద్రపోతుంది జానకి. కట్ చేస్తే తెల్లవారుతుంది. జ్ఞానాంబ ఫ్యామిలీ గుడికి వెళ్తుంది. గుడిలో అందరూ చూసి మిమ్మల్ని టీవీలో చూశాం.. అంటారు. రామచంద్రా టీవీలో నువ్వు మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది అంటుంది ఓ ఆవిడ.

నీకు మహా సిగ్గు కదా. ఎవరైనా మాట్లాడితే నేల చూపులు చూస్తుంటావు కదా.. టీవీలో మాత్రం చాలా ధైర్యంగా మాట్లాడావు అంటారు. దీంతో దానికి కారణం మా వదినే అంటారు అఖిల్, వెన్నెల. జ్ఞానాంబ గారు కోడలు అంటే మీ కోడలు జానకిలా ఉండాలి అని అందరూ మెచ్చుకుంటారు.

ఇవాళ రేపు కోడళ్లు అందరూ భర్తలను తీసుకెళ్లి వేరే కాపురం పెట్టాలనుకుంటున్నారు.. అంటారు. మీ కోడలు మాత్రం కుటుంబ గౌరవం కోసమే పాటుపడుతోంది అంటారు. తర్వాత పూజలో పాల్గొంటారు. పూజ కోసం డబ్బులు ఇవ్వబోతుండగా జ్ఞానాంబను వద్దు అంటాడు పూజారి.

త్వరలో జరగబోయే ధ్వజస్తంభ అధిరోహణ కోసం మీ కోడలు గారు కొంత విరాళం ఇచ్చారు అని చెబుతాడు పూజారి. ఆ స్వామి వారి ఆశీస్సులతో మీకుటుంబంలో ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటారు అని చెబుతాడు పూజారి. మెట్టినింటిని కూడా పుట్టినింటిలా భావించే అలాంటి కోడలు రావడం మీ అదృష్టం అంటాడు పూజారి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Asia Cup 2025 | ఆసియా క‌ప్‌లో భార‌త్ క‌ప్ కొట్టినా కూడా తీసుకోదా.. సూర్యకి ఏమైంది?

Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…

10 minutes ago

Aghori | వర్షిణి – అఘోరీ వివాదం కొత్త మలుపు.. మోసం చేసింది నువ్వురా..మోసపోయింది నేనురా అంటూ సంచలన వ్యాఖ్యలు

Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…

2 hours ago

Raja Saab | ఎట్ట‌కేల‌కి రాజా సాబ్ ట్రైల‌ర్‌కి ముహూర్తం ఫిక్స్ చేశారు.. ఇక ఫ్యాన్స్‌కి పండ‌గే..!

Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…

4 hours ago

Telangana | తెలంగాణలో దంచికొడుతున్న వ‌ర్షాలు.. 11 జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్

Telangana |  తెలంగాణ రాష్ట్రంలో వ‌ర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…

6 hours ago

Makhana | మఖానా ఆరోగ్యాన్ని కాపాడే సూపర్ ఫుడ్ .. ఇది తింటే ఆ స‌మ‌స్య‌లన్నీ మ‌టాష్‌

Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…

7 hours ago

Salt | పింక్‌ సాల్ట్‌ vs సాధారణ ఉప్పు .. మీ ఆరోగ్యానికి ఏది ఉత్తమం?

Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…

8 hours ago

Periods | పీరియడ్స్‌ సమయంలో తల స్నానం చేయకూడదా.. వైద్య నిపుణులు సూటిగా చెప్పే సత్యం ఇదే..!

Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్‌ సమయంలో తల స్నానం చేయరాదు,…

9 hours ago

Weight | బరువు తగ్గాలనుకునే వారు తప్పనిసరిగా చదవాల్సిన వార్త.. అరటిపండు,యాపిల్‌ల‌లో ఏది బెస్ట్‌

Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…

10 hours ago