Lata Mangeshkar : బ్రేకింగ్ : లతా మంగేష్కర్ కు కరోనా.. తీవ్ర అస్వస్థతతో ఐసీయూలో చేరిక..!
Lata Mangeshkar : ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ కరోనా బారిన పడ్డారు. మహమ్మారి లక్షణాలు కనిపించగా వైద్య నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న లతాకు కరోనా నిర్ధారణ అయినట్లు సమాచారం. అప్పటికే పరిస్థితి తీవ్రంగా మారడంతో కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు.
ప్రస్తుతం ఆమె ఐసీయూలో ఉన్నారని కానీ ఆవిడ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపారు. అయితే ఆవిడ పూర్తి ఆరోగ్య పరిస్థితులపై మరింత అప్ డేట్ రావాల్సి ఉంది. తమ అభిమాన గాయని కరోనా బారిన పడ్డారన్న విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా భారత్ లో గత రెండు నాలుగు రోజులుగా లక్షకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. గత కొన్ని వారాలుగా రాజకీయ, సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు.

singer lata mangeshkar joined in hospital with covid positve
తమిళ ఇండస్ట్రీ లో ఇప్పటికే కమల్, విక్రమ్, వడివేలు, హీరోయిన్ త్రిషతో పాటు టాలీవుడ్ లో ప్రిన్స్ మహేష్ బాబు, హీరో విశ్వక్ సేన్, మంచు లక్ష్మీ మాత్రమే కాక పలువురు మహమ్మారి బారిన పడ్డారు. అయితే వీరిలో ఇప్పటికే పలువురు కోలుకోగా.. కోవిడ్ తాజా వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.