Covid Positive : బాలీవుడ్‌కి కరోనా పాజిటివ్.. అన్నిరాష్ట్రాలలో విజృంభిస్తున్న వైరస్..!
Covid Positive : మరోసారి కరోనా మహమ్మారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది ..ఆసియా దేశాల్లో కోవిడ్ ఎక్కువగా విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది. ముంబయి, చెన్నై, అహ్మదాబాద్ లాంటి నగరాల్లో కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. రెండు రోజుల క్రితం బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్ కు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. నాకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రజలంతా మాస్కులు ధరించి సేఫ్ గా ఉండండి అంటూ శిల్పా శిరోద్కర్ సోషల్ మీడియాలో ప్రకటించారు.

Covid Positive : బాలీవుడ్‌కి కరోనా పాజిటివ్.. అన్ని రాష్ట్రాలలో విజృంభిస్తున్న వైరస్..!
Covid Positive కరోనా టెర్రర్..
శిల్పా శిరోద్కర్ తర్వాత మరో బాలీవుడ్ నటి కోవిడ్ బారిన పడ్డారు. ఆ హీరోయిన్ మరెవరో కాదు నిఖిత దత్త. తనకు కోవిడ్ సోకిన విషయాన్ని నిఖిత సోషల్ మీడియాలో ప్రకటించారు. కోవిడ్ వచ్చి నన్ను నా తల్లిని పలకరించింది. అనుకోకుండా వచ్చిన ఈ గెస్ట్ ఎక్కువ కాలం ఉండదని అనుకుంటున్నా. ప్రస్తుతం క్వారంటైన్ లో ఉంటున్నా. అందరూ సేఫ్ గా ఉండండి అంటూ నిఖిత పోస్ట్ చేసింది.
ఇటీవల ఇండియాలో 200 పైగా కోవిడ్ కేసులో నమోదైనట్లు తెలుస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగిన చర్యలు ప్రారంభించాయి.ఏపీలో కూడా కరోనా ఘంటికలు మోగాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి.