Covid Virus : మ‌ళ్లీ వ‌ణుకు పుట్టిస్తున్న క‌రోనా.. కేసులు పెరుగుతుండడంతో..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Covid Virus : మ‌ళ్లీ వ‌ణుకు పుట్టిస్తున్న క‌రోనా.. కేసులు పెరుగుతుండడంతో..!

 Authored By ramu | The Telugu News | Updated on :18 May 2025,8:00 pm

Covid Virus : ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో, ముఖ్యంగా ఆసియా ఆదేశాల్లో (హాంకాంగ్-సింగపూర్) కరోనా కేసులు ఆందోళనను రేకెత్తించాయి. గత కొన్ని వారాల్లో కరోనా కేసులు గణనీయంగా పెరిగాయని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ పెరుగుతున్న కేసులకు కొత్త వేరియంట్‌ కారణమని ఇప్పటి వరకు నిపుణులు ప్రకటించలేదు. అయితే, వ్యాక్సిన్ రోగనిరోధక శక్తి తగ్గుతోందని, ఫలితంగా వైరస్ ప్రభావం మరోసారి కనిపిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కరోనాకు బూస్టర్ వ్యాక్సిన్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా రక్షణ ఉంటుందన్నారు. గతంలో ఫ్లూ మాదిరిగానే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని పలు ఆరోగ్య సంస్థలు సూచిస్తున్నాయి. హాంకాంగ్, సింగపూర్ వంటి నగరాల్లో ఆసుపత్రిలో చేరడం, మరణాలతో పాటు కొత్త కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. దాదాపు సంవత్సరం తర్వాత తొలిసారిగా కేసులు పెరుగుతున్నాయి.

Covid Virus మ‌ళ్లీ వ‌ణుకు పుట్టిస్తున్న క‌రోనా కేసులు పెరుగుతుండడంతో

Covid Virus : మ‌ళ్లీ వ‌ణుకు పుట్టిస్తున్న క‌రోనా.. కేసులు పెరుగుతుండడంతో..!

అనేక దేశాలలో పెరుగుతున్న ప్రమాదాలను చూసి, ఆరోగ్య సంస్థలు ప్రజలను అప్రమత్తం చేశాయి. మరో వైపు పెరుగుతున్న ముప్పు మధ్య యూఎస్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్ నోవావాక్స్‌ కొత్త వ్యాక్సిన్‌ను ఆమోదించింది. అమెరికాకు చెందిన నెబ్రాస్కా మెడిసిన్‌లో అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ మార్క్ ఈ రూప్ మాట్లాడుతూ.. ప్రస్తుతం అమెరికాతో సహా ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ఎల్‌పీ.8.1 వేరియంట్‌ ద్వారా కేసులు పెరుగుతున్నాయన్నారు. 70శాతం కేసులకు ఈ వేరియంట్‌ కారణమని.. 9శాతం కేసులకు ఎక్స్‌ఎఫ్‌సీ వేరియంట్‌ కారహన్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది