Singer Mangli : ఒకప్పుడు టీవీ కార్యక్రమాల్లో కనిపించిన మంగ్లీ ఇప్పుడు తెలుగులోనే టాప్ సింగర్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. కేవలం తెలుగు పాటలు మాత్రమే కాకుండా కన్నడ పాటలు కూడా పాడుతూ సౌత్ ఇండియా మొత్తం పాపులారిటీని సొంతం చేసుకుంటుంది. విభిన్నమైన గాత్రం ఆమె సొంతం, ఒక పాటని ఆమె కు అప్పగిస్తే జనాలు ఆ పాటను అభిమానించేలా చేయడం ఆమె యొక్క నైజం. అందుకే ఆమె పాట అత్యంత అలరించే విధంగా ఉంటుందని అభిమానులు అంటూ ఉంటారు. ఆమె పాటల్లో ఉండే మాధుర్యం అద్భుతం అన్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఐటెం సాంగ్స్ పాడినా.. ఇతర పాటలు పాడినా కూడా మంగ్లీ ఆ పాటకు తగ్గట్లుగా, పరిస్థితికి తగ్గట్లుగా తన గొంతు మార్చి వాడడంలో ఆమెకు ఆమె సాటి.
మంగ్లీ ఒకప్పుడు పాటకు పది వేలు… 20వేల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకునేది. కానీ ఇప్పుడు ఆమె పారితోషికం ఎంతో చెప్తే ఆశ్చర్యం కలగాల్సిందే. గతంలో తీసుకున్న రెమ్యూనరేషన్ కంటే వంద రెట్ల అధిక రెమ్యూనరేషన్ మంగ్లీ తీసుకుంటుందని సమాచారం అందుతుంది. అంతే కాకుండా తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా రెగ్యులర్ గా పాటలను ప్రేక్షకులకు అందిస్తూనే ఉంది. ప్రైవేట్ సాంగ్స్ తో మంగ్లీ యూట్యూబ్ ద్వారా సంపాదించే మొత్తం ఎంతో తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఆమె ప్రతి పాటతో మిలియన్స్ కొద్ది వ్యూస్ సొంతం చేసుకుంటుంది. ఆమె యూట్యూబ్ లో వందల మిలియన్ల వ్యూస్ ఇప్పటికే నమోదయి ఉన్నాయి. అందుకే లక్షల రూపాయలు నెల నెలా ఆమెకు వస్తూనే ఉంటాయి.
మొత్తానికి సింగర్ గా సినిమాల్లో పాట పాడితే భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ రావడంతో పాటు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మంగ్లీ భారీ మొత్తంలో సంపాదిస్తుంది. ఇక స్టేజ్ కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నందుకు దక్కే రెమ్యూనరేషన్ కూడా ఇతర సింగర్స్ తో పోలిస్తే దాదాపు రెట్టింపు అన్నట్లుగా ఉంటుందని ప్రచారం జరుగుతుంది. ఇటీవల కర్ణాటకలోని బళ్లారిలో జరిగిన ఒక కార్యక్రమంలో మంగ్లీ పాల్గొన్నారు. ఆ కార్యక్రమానికి మంగ్లీ తీసుకున్న పారితోషికం కళ్ళు చెదిరే విధంగా ఉంది అంటూ చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మంగ్లీ ముందు ముందు మరిన్ని సినిమా పాటలు పాడాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. అలాగే ఆమె రెమ్యూనరేషన్ మరింతగా పెరగాలని యూట్యూబ్ లో ఆమె మరింత స్పీడ్ గా పాటలను విడుదల చేయాలని ప్రతి ఒక్క అభిమాని విజ్ఞప్తి చేస్తున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.