Singer Mangli : మంగ్లీ ఒక్క సినిమా పాట పాడితే ఎంత రెమ్యూనరేషన్‌ తీసుకుంటుందో తెలుసా..!! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Singer Mangli : మంగ్లీ ఒక్క సినిమా పాట పాడితే ఎంత రెమ్యూనరేషన్‌ తీసుకుంటుందో తెలుసా..!!

Singer Mangli : ఒకప్పుడు టీవీ కార్యక్రమాల్లో కనిపించిన మంగ్లీ ఇప్పుడు తెలుగులోనే టాప్ సింగర్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. కేవలం తెలుగు పాటలు మాత్రమే కాకుండా కన్నడ పాటలు కూడా పాడుతూ సౌత్ ఇండియా మొత్తం పాపులారిటీని సొంతం చేసుకుంటుంది. విభిన్నమైన గాత్రం ఆమె సొంతం, ఒక పాటని ఆమె కు అప్పగిస్తే జనాలు ఆ పాటను అభిమానించేలా చేయడం ఆమె యొక్క నైజం. అందుకే ఆమె పాట అత్యంత అలరించే విధంగా ఉంటుందని […]

 Authored By prabhas | The Telugu News | Updated on :25 January 2023,6:20 pm

Singer Mangli : ఒకప్పుడు టీవీ కార్యక్రమాల్లో కనిపించిన మంగ్లీ ఇప్పుడు తెలుగులోనే టాప్ సింగర్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. కేవలం తెలుగు పాటలు మాత్రమే కాకుండా కన్నడ పాటలు కూడా పాడుతూ సౌత్ ఇండియా మొత్తం పాపులారిటీని సొంతం చేసుకుంటుంది. విభిన్నమైన గాత్రం ఆమె సొంతం, ఒక పాటని ఆమె కు అప్పగిస్తే జనాలు ఆ పాటను అభిమానించేలా చేయడం ఆమె యొక్క నైజం. అందుకే ఆమె పాట అత్యంత అలరించే విధంగా ఉంటుందని అభిమానులు అంటూ ఉంటారు. ఆమె పాటల్లో ఉండే మాధుర్యం అద్భుతం అన్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఐటెం సాంగ్స్ పాడినా.. ఇతర పాటలు పాడినా కూడా మంగ్లీ ఆ పాటకు తగ్గట్లుగా, పరిస్థితికి తగ్గట్లుగా తన గొంతు మార్చి వాడడంలో ఆమెకు ఆమె సాటి.

మంగ్లీ ఒకప్పుడు పాటకు పది వేలు… 20వేల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకునేది. కానీ ఇప్పుడు ఆమె పారితోషికం ఎంతో చెప్తే ఆశ్చర్యం కలగాల్సిందే. గతంలో తీసుకున్న రెమ్యూనరేషన్ కంటే వంద రెట్ల అధిక రెమ్యూనరేషన్ మంగ్లీ తీసుకుంటుందని సమాచారం అందుతుంది. అంతే కాకుండా తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా రెగ్యులర్ గా పాటలను ప్రేక్షకులకు అందిస్తూనే ఉంది. ప్రైవేట్ సాంగ్స్ తో మంగ్లీ యూట్యూబ్ ద్వారా సంపాదించే మొత్తం ఎంతో తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఆమె ప్రతి పాటతో మిలియన్స్ కొద్ది వ్యూస్ సొంతం చేసుకుంటుంది. ఆమె యూట్యూబ్ లో వందల మిలియన్ల వ్యూస్ ఇప్పటికే నమోదయి ఉన్నాయి. అందుకే లక్షల రూపాయలు నెల నెలా ఆమెకు వస్తూనే ఉంటాయి.

singer mangli remuneration for her one song singing

singer mangli remuneration for her one song singing

మొత్తానికి సింగర్ గా సినిమాల్లో పాట పాడితే భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ రావడంతో పాటు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మంగ్లీ భారీ మొత్తంలో సంపాదిస్తుంది. ఇక స్టేజ్ కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నందుకు దక్కే రెమ్యూనరేషన్ కూడా ఇతర సింగర్స్ తో పోలిస్తే దాదాపు రెట్టింపు అన్నట్లుగా ఉంటుందని ప్రచారం జరుగుతుంది. ఇటీవల కర్ణాటకలోని బళ్లారిలో జరిగిన ఒక కార్యక్రమంలో మంగ్లీ పాల్గొన్నారు. ఆ కార్యక్రమానికి మంగ్లీ తీసుకున్న పారితోషికం కళ్ళు చెదిరే విధంగా ఉంది అంటూ చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మంగ్లీ ముందు ముందు మరిన్ని సినిమా పాటలు పాడాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. అలాగే ఆమె రెమ్యూనరేషన్ మరింతగా పెరగాలని యూట్యూబ్ లో ఆమె మరింత స్పీడ్ గా పాటలను విడుదల చేయాలని ప్రతి ఒక్క అభిమాని విజ్ఞప్తి చేస్తున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది