Sudigali Sudheer : పదే పదే సుడిగాలి సుధీర్‌ను కించపర్చడమేనా?.. దారుణమైన కామెంట్లు
Sudigali Sudheer : బుల్లితెరపై సుడిగాలి సుధీర్‌ను చివరకు బీ గ్రేడ్ ఆర్టిస్ట్‌ను చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నట్టున్నారు. ప్రతీ ఒక్కరూ సుధీర్ మీద పంచ్‌లు వేస్తూనే ఉంటారు. డబుల్ మీనింగ్ డైలాగ్‌లనే వాడుతుంటారు. సుధీర్‌కు అమ్మాయిల పిచ్చి ఉన్నట్టుగా స్క్రిప్ట్‌లను రాసుకుంటూ ఉంటారు. ఇక సొరంగాలు అంటూ ఈ మధ్య మరింత ఎక్కువగా సుధీర్‌ను టార్గెట్ చేస్తున్నారు.
తాజాగా రష్మీతో కలిసి సుధీర్ ఓ స్కిట్ వేశాడు. ఇందులోనూ సుధీర్‌ను వెకిలి వేషాలు వేసేవాడిలానే చూపించాడు. రష్మీ పోలీస్ ఆఫీసర్‌గా నటించింది. పాస్ వర్డ్ చెప్పమంటే.. ఉమ్మా.. అని.. ఇంకోపాస్ వర్డ్ చెప్పమంటే త్వరగా వచ్చేయ్ అంటూ రష్మీకి డబుల్ మీనింగ్ డైలాగ్ వేసినట్టుగా స్క్రిప్ట్ రచించారు. ఇందులో రష్మీ బాగానే నటించింది.

Singer Mano Satires on Sudigali Sudheer
Sudigali Sudheer : సుధీర్‌పై మనో సెటైర్లు..
రోజూ ఉదయాన్నే ఏం చేస్తావ్ అని రష్మీ అడిగితే.. రోజూ ఉదయాన్నే మా ఇంటికి వెళ్తాను అని సుధీర్ అంటాడు. అదేంటి రోజూ నువ్ మీ ఇంట్లో పడుకోవా? అని రష్మీ అడుగుతుంది. ఇక మధ్యలోకి మనో ఎంట్రీ ఇస్తాడు. నైట్ అంతా కూడా సొరంగంలోనే ఉంటాడు అని మనో పరువు తీసేస్తాడు. ఇదేంటి సార్ అన్నట్టుగా సుధీర్ చూసేస్తాడు. మొత్తానికి తనను ఎంత కించపరిచినా కూడా కామెడీ కోసం భరిస్తూనే ఉంటాడు సుధీర్.
