Singer Sunitha : సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు చలనచిత్ర రంగంలో దాదాపు హీరోయిన్ లకు ఉన్న క్రేజ్ ఈ సింగర్ సునీతకి ఉంది. చాలామంది టాప్ హీరోయిన్ లకు సునీత డబ్బింగ్ కూడా చెప్పడం జరిగింది. ఆమె వాయిస్ కి మంచి డిమాండ్ ఉంది. ఎన్నో విజయవంతమైన టాప్ మోస్ట్ హిట్ సాంగ్స్ ఆలపించిన సునీత.. ఇప్పుడు కొడుకు కోసం ఎవరు చేయలేని త్యాగం చేయడానికి సిద్ధపడినట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. విషయంలోకి వెళ్తే సింగర్ సునీత తన కొడుకు ఆకాష్ నీ హీరోగా పరిచయం చేయడానికి రెడీ కావడం జరిగిందంట.
ఈ క్రమంలో లెజెండరీ ఫిలిం మేకర్ కె రాఘవేంద్రరావు బ్యానర్ ఆర్కే తెలుగు ఫిలిం షో ప్రొడక్షన్ లో ఆకాష్ హీరోగా “సర్కారు నౌకరి” అనే కొత్త సినిమాని నిర్మిస్తున్నారట. శేఖర్ గంగ మౌని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారట. పిరియాడిక్ డ్రామా నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి చిత్రీకరణ చాలా సైలెంట్ గా జరుగుతుంది. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేయడం జరిగింది. థియేటర్ ఆర్టిస్ట్ భావన వజపండల్ ఇందులో హీరోయిన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో సీనియర్ నటుడు తనికెళ్ల భరణి కీలక పాత్ర పోషిస్తున్నారట.
ఇంకా చాలామంది తెలుగు సీనియర్ నటీనటులు నటిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో తన కొడుకు మొదటి సినిమా ప్రమోషన్ కార్యక్రమాల విషయంలో సింగర్ సునీత తనవంతుగా ముందుకు వచ్చి మరింతగా జనాల్లోకి ఈ సినిమాని తీసుకెళ్లే రీతిలో.. కృషి చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలో తన పాత్ర లేకపోయినా కొడుకు మొదటి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు దగ్గరుండి తానే మొత్తం చూసుకోబోతున్నట్లు.. అంతేకాదు కొడుకు మొదటి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తానే హోస్ట్ గా చేయాలని పట్టుబడుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
Heels Cracked : చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు అనేవి వెంటాడుతాయి. అలాగే చర్మం పగిలిపోవడం మరియు పొడిబారడం,చర్మం నిర్జీవంగా…
Hero Splendor Plus : హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ సొంతం చేసుకోవాలనే వారికి షో రూం హర కంటే…
Acidity : ప్రస్తుత కాలంలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు కడుపుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.…
Nagarjuna : ప్రతి శనివారం నాగార్జున బిగ్ బాస్ Bigg Boss Telugu 8 వేదికపైకి వచ్చి తెగ సందడి…
Ranapala Leaves : రణపాల మొక్క అనేది శాస్త్రీయ మొక్క. దీని ఆకులు కాస్త మందంగానే ఉంటాయి. ఈ ఆకులు తింటే…
Pensioners : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పింఛన్లను ఇచ్చే దిశగా అడుగులు వేస్తుంది. కొత్త పింఛన్ కావాలనుకునే వారికి ఇది…
Ginger Tea : చలికాలం రానే వచ్చింది. అలాగే చలి తీవ్రత కూడా బాగా పెరిగింది. అయితే ఈ చలికాలంలో దగ్గు…
Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతి దిశ ప్రతి వస్తువు సమతుల్యతను కాపాడడంలో ప్రత్యేక స్థానం ఉంటుంది.…
This website uses cookies.