మొత్తానికి ఆ సమయం వచ్చింది!.. కాబోయే భర్తను పరిచయం చేసిన సింగర్ సునీత
టాలీవుడ్ సింగర్ సునీత పర్సనల్ లైఫ్ గురించి అందరికీ తెలిసిందే. చిన్నతనంలోనే పెళ్లి అవ్వడం, పిల్లలు కూడా పుట్టడం ఆ తరువాత భర్తతో విడాకులు అవ్వడం ఇలా అన్ని విషయాలు అందరికీ తెలిసిందే. అయితే సునీత రెండో పెళ్లి గురించి నిత్యం ఏదో రకమైన వార్తలు వచ్చేవి. గత వారం నుంచి సునీత రెండో పెళ్లిపై మళ్లీ వార్తలు ఊపందుకున్నాయి. సునీత రెండో పెళ్లికి సిద్దమైందని, నిశ్చితార్థం కూడా జరిగిందంటూ వార్తలు వైరల్ అయ్యాయి.

Singer Sunitha Second Marriage with ram
నేటి ఉదయం నుంచి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు కూడా తెగ వైరల్ అయ్యాయి. సునీత ఓ మీడియా పర్సన్‌ను పెళ్లి చేసుకోబోతందని, దానికి సంబంధించిన నిశ్చితార్థం నేడు జరిగిందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ కాసాగాయి. అయితే వాటిని సునీత ధృవీకరిస్తూ తాజాగా తనకు కాబోయే భర్త ఫోటోను షేర్ చేసింది. ప్రతీ తల్లిలానే నాక్కూడా నా పిల్లలను బాగా సెటిల్ చేయాలనే కోరిక, కలలు ఉండేవి.

Singer Sunitha Second Marriage with ram
అదే సమయంలో నాకు ఎంతో గొప్పగా ఆలోచించే పిల్లలు, పేరెంట్స్‌ను ఆ దేవుడు ఇచ్చాడు. వారు కూడా నేను బాగా సెటిల్ అవ్వాలని కోరుకునేవారు. మొత్తానికి చివరగా ఆ సమయం వచ్చింది. రామ్ నా లైఫ్‌లోకి ఓ కేరింగ్ ఫ్రెండ్‌గా ప్రవేశించాడు. చివరకు గొప్ప భాగస్వామిగా మారాడు. మేమిద్దరం త్వరలోనే పెళ్లి చేసుకోబోతోన్నాం. నా పర్సనల్ లైఫ్‌ను ప్రైవేట్‌గా ఉంచుకుంటాను.. అది అర్థం చేసుకున్న నా వాళ్లందరికి ధన్యవాదాలు. మీరు నాకెల్లప్పుడు మద్దతు తెలిపి నాకు సపోర్ట్ చేయండని అభిమానులను సునీత కోరింది.