Single Movie : ట్రైలర్ వివాదం.. మంచు ఫ్యామిలీ కి క్షేమపణలు చెప్పిన యంగ్ హీరో..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Single Movie : ట్రైలర్ వివాదం.. మంచు ఫ్యామిలీ కి క్షేమపణలు చెప్పిన యంగ్ హీరో..!

 Authored By ramu | The Telugu News | Updated on :1 May 2025,5:00 pm

Single Movie : టాలీవుడ్‌లో ఇటీవల విడుదలైన శ్రీవిష్ణు నటించిన ‘సింగిల్’ సినిమా ట్రైలర్ చుట్టూ వివాదం చెలరేగింది. ఈ ట్రైలర్‌లో హీరో శ్రీవిష్ణు “శివయ్య” అని పిలిచే డైలాగ్ మరియు “మంచు కురిసిపోయింది” అనే డైలాగ్ లు వివాదాస్పదంగా మారాయి. ప్రేక్షకులు ఈ డైలాగ్‌లను కేవలం వినోద పరంగా చూసినా, మోహన్ బాబు కుటుంబానికి దగ్గరగా ఉన్న వారు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ‘కన్నప్ప’ సినిమా టీమ్ ఈ ట్రైలర్‌ను తమ సినిమాపై చేసిన సైటైర్ గా భావిస్తోంది.

Single Movie ట్రైలర్ వివాదం మంచు ఫ్యామిలీ కి క్షేమపణలు చెప్పిన యంగ్ హీరో

Single Movie : ట్రైలర్ వివాదం.. మంచు ఫ్యామిలీ కి క్షేమపణలు చెప్పిన యంగ్ హీరో..!

Single Movie మంచు విష్ణుకు సారీ చెప్పడం ఏంటి..? ఫ్యాన్స్ ఫైర్

‘కన్నప్ప’ సినిమాలో హీరో విష్ణు చెప్పిన డైలాగ్‌ను ‘సింగిల్’ ట్రైలర్‌లో వ్యంగ్యంగా వాడారని, ఇది మోహన్ బాబు కుటుంబాన్ని అవమానించినట్లుగా ఉందని వారు ఆరోపిస్తున్నారు. “మంచు కురిసిపోయింది” అనే డైలాగ్ కూడా మోహన్ బాబు ఇంటిపేరు “మంచు”పై ఆటలు ఆడినట్లుగా ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలతో ట్రైలర్ విడుదల అనంతరం మోహన్ బాబు, విష్ణు అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. ట్రైలర్‌లోని కొన్ని దృశ్యాలు మరియు డైలాగ్‌లు ఉద్దేశపూర్వకంగా చూసేలా ఉన్నాయని, ఇవి మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉన్నాయని భావిస్తున్నారు.

ఈ వివాదం వేడెక్కడంతో హీరో శ్రీవిష్ణు స్పందిస్తూ.. మోహన్ బాబు కుటుంబాన్ని బాధపెట్టాలన్న ఉద్దేశం ఎప్పుడూ తనకు లేదని స్పష్టం చేశారు. “ఇది కేవలం వినోదం కోసమే చేయబడిన ట్రైలర్” అంటూ ఆయన చెప్పినప్పటికీ, ఏవైనా వ్యాఖ్యలు మోహన్ బాబు గారిని లేదా వారి కుటుంబాన్ని బాధించాయంటే తాను హృదయపూర్వకంగా క్షమాపణ చెబుతున్నానని వెల్లడించారు. మరి శ్రీవిష్ణు సారీ తో శాంతిస్తారా లేదా అనేది చూడాలి. అయితే శ్రీవిష్ణు ఫ్యాన్స్ మాత్రం విష్ణుకు సారీ చెప్పడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.

Tags :

    ramu

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది