Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేవారికి గుడ్‌న్యూస్..కేంద్రం నుంచి నిధులు..ఒక్కో ఇంటికి ఎంతిస్తారో తెలుసా?

 Authored By suma | The Telugu News | Updated on :2 February 2026,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేవారికి గుడ్‌న్యూస్..కేంద్రం నుంచి నిధులు..ఒక్కో ఇంటికి ఎంతిస్తారో తెలుసా?

Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ  central government వాటా ఖరారయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం  State government  ఆశించిన స్థాయిలో కాకపోయినా ఓ మోస్తరు స్థాయిలో అయినా కేంద్రం నుంచి నిధులు అందనున్నాయి. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పట్టణాలు, గ్రామాల్లో కలిపి మొత్తం 13 లక్షల ఇళ్లకు కేంద్ర వాటా ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం విజ్ఞప్తి చేయగా అందులో దాదాపు 4.13 లక్షల ఇళ్లకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన PMAY కింద నిధులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేవారికి గుడ్‌న్యూస్..కేంద్రం నుంచి నిధులు..ఒక్కో ఇంటికి ఎంతిస్తారో తెలుసా?

Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేవారికి గుడ్‌న్యూస్..కేంద్రం నుంచి నిధులు..ఒక్కో ఇంటికి ఎంతిస్తారో తెలుసా?

Indiramma Houses : పట్టణ ప్రాంతాల్లో పీఎంఏవై–అర్బన్ 2.0 కేటాయింపులు

పీఎంఏవై–అర్బన్ 2.0 పథకం కింద 2026–27 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు  Telangana కేంద్ర ప్రభుత్వం 1.13 లక్షల ఇళ్లను కేటాయించనుంది. ఇప్పటికే ఈ పథకం కింద 10 వేల ఇళ్లకు అనుమతి లభించగా తాజాగా మరో 1.03 లక్షల ఇళ్లకు గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశముంది. పట్టణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్రం రూ.1.50 లక్షల చొప్పున నిధులు అందించనుంది. ఈ లెక్కన సుమారు రూ.1,690 కోట్ల మేర కేంద్ర సహాయం రాష్ట్రానికి లభించనుంది. అలాగే గతంలో పీఎంఏవై–అర్బన్ పథకం కింద నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లకు సంబంధించిన బకాయిలు కూడా విడుదలయ్యే సూచనలు ఉన్నాయి. సుమారు 33 వేల ఇళ్లకు కేంద్రం తన వాటాగా మరో రూ.500 కోట్ల వరకు నిధులు మంజూరు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నిధులు విడుదలైతే పట్టణ పేదలకు ఇళ్ల నిర్మాణంలో రాష్ట్రానికి గణనీయమైన ఊరట లభించనుంది.

Indiramma Houses : గ్రామీణ ఇళ్లకు కేంద్ర నిధులు – ఆదివాసీలకు ప్రత్యేక కేటాయింపు

పీఎంఏవై–గ్రామీణ పథకం  PMAY-Gramin Scheme  కింద రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల ఇళ్లకు కేంద్ర వాటా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిధుల ఆధారంగా దాదాపు 3 లక్షల ఇళ్లకు మాత్రమే అవకాశం ఉందని రాష్ట్ర హౌసింగ్ శాఖ అంచనా వేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.72 వేల చొప్పున కేంద్రం నిధులు అందించనుంది. ఈ మేరకు మొత్తం రూ.2,160 కోట్ల వరకు రాష్ట్రానికి వచ్చే అవకాశాలున్నాయి. ఇదే కాకుండా గ్రామీణ పథకంలో భాగంగా ఆదివాసీల కోసం ప్రత్యేకంగా 10 వేల ఇళ్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ ఇళ్ల నిర్మాణానికి ఒక్కో ఇంటికి రూ.1.20 లక్షల చొప్పున నిధులు ఇవ్వనుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే సంబంధిత నిధులు విడుదలయ్యే అవకాశాలు ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా గిరిజన వాసులకు స్వంత ఇళ్ల కల నెరవేరే దిశగా అడుగులు పడుతున్నాయి.

suma

Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి