Home » Exclusive » January 06 2022 Today Covid Cases In India
Exclusive

Today Covid Cases : కరోనా విజృంభణ.. ఒక్కరోజే 90,928 కేసులు..325 మరణాలు.!

Authored By
Inesh A
The Telugu News | Updated on: January 6, 2022, 12:40 pm
Advertisement

Today Covid Cases : భారత్ లో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. ఒక వైపు ఒమిక్రాన్‌ కేసులు, మరో వైపు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్త కేసుల సంఖ్య ఏకంగా 90 వేల 928 కేసులు నమోదు కాగా.. 325 మంది మరణించడం ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా 19,206 మంది మహమ్మారి భారీ నుంచి కోలుకోగా… దేశంలో ప్రస్తుతం 2, 85, 401 యాక్టిివ్ కేసులు ఉన్నాయి.ఇక డైలీ పాజిటివీటి రేటు 6.43 శాతంగా నమోదు చేసుకుంది.

Advertisement

మరోవైపు రోజు 100కు పైగా ఒమిక్రాన్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 2 వేల మార్క్ ను దాటింది. అధిక శాతం కేసులు మహరాష్ట్ర చూశాయి. దేశంలో ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ శరవేగంగా విస్తరిస్తూ గజ గజ లాడిస్తోంది. మూడో వేవ్ కి ఇదే ప్రారంభమని ఇప్పటికే పలువురు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.అయితే ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఇప్పటివరకైతే ప్రమాదం కాదని కేంద్ర వైద్యారోగ్య శాఖ చెబుతోంది.

january 06 2022 today Covid cases in India

Advertisement

ఒమిక్రాన్‌ భారిన పడ్డ బాధితులకు… జలుబు, జ్వరం వంటి సాధారణ ఆరోగ్య సమస్యలు ఉండి త్వరగా కోలుకుంటున్నట్లు పేర్కొంటున్నారు. అయినప్పటికీ ప్రతీ ఒక్కరూ మాస్క్, శానిటైజర్‌, భౌతికదూరం వంటి నియమాలను తప్పక పాటించాలని సూచిస్తున్నారు. ఆ మధ్య కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. గత రెండు మూడు రోజులుగా విపరీతంగా పెరుగుతుండటం ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది.

Inesh A

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి