Shanmukh : షణ్ముఖ్, సిరి సహజీవనం చేస్తారట.. బ్రేకప్‌ కు పూర్తి కారణం షన్నూనే | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shanmukh : షణ్ముఖ్, సిరి సహజీవనం చేస్తారట.. బ్రేకప్‌ కు పూర్తి కారణం షన్నూనే

 Authored By himanshi | The Telugu News | Updated on :4 January 2022,7:00 pm

Shanmukh : సమంత మరియు నాగ చైతన్యలు విడి పోయిన సమయంలో మీడియాలో ఏ స్థాయి హడావుడి కనిపించిందో ఇప్పుడు షణ్ముఖ్ మరియు దీప్తి ల బ్రేకప్‌ విషయంలో ఇంకాస్త ఎక్కువ హడావుడి మీడియాలో కనిపిస్తుంది. నాగార్జున ఫ్యామిలీ పెద్దది.. సమంత స్టార్‌ హీరోయిన్‌.. నాగ చైతన్య స్టార్‌ కనుక సమంత మరియు నాగ చైతన్య ల విడాకుల విషయంలో మీడియా ఎక్కువగా డీప్ విశ్లేషణకు వెళ్లలేదు. ఎందుకంటే ఎక్కడ ఎలాంటి కేసులు పెడతారో అనే ఉద్దేశ్యంతో వారి మ్యాటర్‌ లో పెద్ద విశ్లేషణలు ఇవ్వలేదు. కాని షన్నూ మరియు దీప్తి సునైన ల బ్రేకప్‌ విషయంలో మాత్రం చాలా పెద్ద రచ్చ జరుగుతోంది.రక రకాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఏకంగా సిరిని మర్చి పోలేక..

ఆమెతో రిలేషన్‌ కొనసాగించే ఉద్దేశ్యంతో దీప్తి సునైన కు షన్నూ దూరం అయ్యాడు అంటూ విమర్శలు మొదలు అయ్యాయి. బిగ్‌ బాస్ గ్రాండ్ ఫినాలే తర్వాత హైదరాబాద్‌ లోనే ఉన్న దీప్తి సునైనను షన్నూ కలవలేదట. గ్రాండ్‌ ఫినాలే పూర్తి అయిన వెంటనే తల్లిదండ్రులతో కలిసి వైజాగ్ వెళ్లి పోయాడట. అలా షణ్ముఖ్ వెళ్లి పోవడం వల్ల దీప్తి బాగా హర్ట్‌ అయ్యిందట. ఫినాలే కు వారం ముందు కూడా దీప్తి బిగ్‌ బాస్ స్టేజ్ పైకి షన్నూ కోసం వెళ్లింది. గ్రాండ్ ఫినాలే లో షన్నూ కోసం ఓట్లు వేయాల్సిందిగా సోషల్‌ మీడియాలో అడిగింది.ఇంత చేసిన దీప్తి కి ఇంత చేసిన దీప్తి కి షన్నూ హ్యాండ్‌ ఇచ్చి వైజాగ్‌ వెళ్లాడు. మాట్లాడేందుకు ప్రయత్నించలేదని.. అసలు అతడి నుండి కనీసం రెస్పాన్స్ రాలేదని అంటున్నారు. అందుకే దీప్తి బ్రేకప్‌ చెప్పిందట. హ్యాండ్‌ ఇచ్చి వైజాగ్‌ వెళ్లాడు. మాట్లాడేందుకు ప్రయత్నించలేదని.. అసలు అతడి నుండి కనీసం రెస్పాన్స్ రాలేదని అంటున్నారు. అందుకే దీప్తి బ్రేకప్‌ చెప్పిందట.

Siri and Shanmukh may be in living relationship

Siri and Shanmukh may be in living relationship

Shanmukh : సిరి, శ్రీహాన్‌ కూడా విడిపోయారా?

షన్నూ కు కావాల్సింది కూడా అదే అని.. ఎందుకంటే అతడు సిరి తో లివింగ్ రిలేషన్‌ షిప్ ను కోరుకుంటున్నాడు అంటూ టాప్‌ వినిపిస్తుంది. సిరి కూడా గత కొన్నాళ్లుగా శ్రీహాన్ తో కనిపించడం లేదు. సోషల్‌ మీడియాలో ఫినాలే తర్వాత ఒకే ఒక్క పోస్ట్‌ ను సిరి పెట్టింది. అలాగే శ్రీహాన్ కూడా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ లు పెట్టడం లేదు. సిరి మరియు శ్రీహాన్‌ లో ఏ ఒక్కరు కూడా ఇద్దరు కలిసి ఉన్న పోస్ట్ కాని స్టోరీ కాని ఇన్‌ స్టా లో పెట్టలేదు. దాంతో వారు కూడా బ్రేకప్‌ అయ్యారు.. లేదా అవ్వబోతున్నారు అనే టాక్ వినిపిస్తుంది.

ఇదంతా వ్యవహారం చూస్తుంటే సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా నిజంగానే సిరి మరియు షన్నూ లు నిజంగా కలువబోతున్నారా.. ఇద్దరు సహజీవనం సాగించబోతున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక సీనియర్‌ జర్నలిస్ట్ ఒకరు సోషల్‌ మీడియాలో తనకు అందిన సమాచారం అంటూ షన్నూ మరియు సిరి లు సహజీవనం సాగిస్తారు అంటూ చెప్పుకొచ్చాడు. నిప్పు లేనిదే పొగ రాదు అంటారు. కనుక ఖచ్చితంగా ఇద్దరి మద్య బిగ్‌ బాస్ లో మొదలు అయిన ప్రేమ కంటిన్యూ అవుతున్నట్లుగా అనిపిస్తుంది. ఈ విషయాలన్నింటిపై క్లారిటీ రావడానికి మరో రెండు మూడు నెలల సమయం పడుతుందని కొందరు అంటున్నారు. ఒక వేళ షన్నూ మరియు సిరి లు సహజీవనం సాగిస్తే అభిమానుల రియాక్షన్ ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది