Bigg Boss 5 Telugu Shanmukh : దీప్తి సునయన, షణ్ముక్ బ్రేకప్.. విమర్శలపై నోరు విప్పిన సిరి ..!
Bigg Boss 5 Telugu Shanmukh: యూట్యూబర్‌గా పాపులారిటీ సంపాదించుకున్న షణ్ముక్ జస్వంత్.. ఆ క్రమంలోనే తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ ఫైవ్‌లో పార్టిసిపేట్ చేసే చాన్స్ దక్కించుకున్నారు. అయితే, హౌజ్‌లో కంటెస్టెంట్ గా షణ్ముక్ జస్వంత్ పర్ఫార్మెన్స్ పైన చాలా నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. బయట ఉన్నపుడు ఎంత పాపులారిటీ ఉందో .. షో కు వెళ్లాక అంత నెగెటివ్ అయిపోయాడు షణ్ణు. ముఖ్యంగా సిరి హన్మంత్‌తో షణ్ముక్ బిహేవియర్ పైన సోషల్ మీడియాలో విపరీతమైన డిస్కషన్ జరిగింది.ఇటీవల సీజన్ ఫైవ్ ఎపిసోడ్ ముగిసింది. షణ్ముక్ రన్నరప్‌గా నిలిచాడు. కాగా, హౌజ్‌లో షణ్ముక్ ప్రవర్తన ఇన్నాళ్లు కష్టపడి సంపాదించుకున్న ఇమేజ్‌కు పెద్ద దెబ్బ పడందని చెప్పొచ్చు.
ఐదేళ్ల పాటు దీప్తి సునయనతో షణ్ముక్ జస్వంత్‌కు ఉన్న రిలేషన్ కూడా బీటలు వారింది. అలా మొత్తంగా నెగెటివ్ ఇమేజ్ మూట కట్టుకున్నాడు షణ్ణు. హౌజ్‌లో ఫ్రెండ్స్ అంటూనే సిరి హన్మంత్, షణ్ముక్ జస్వంత్ మధ్య జరిగిన రొమాన్స్ చర్చనీయాంశమైంది. కాగా, హౌజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత షణ్ముక్ .. త్వరలో తన గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునయనను కలుస్తానని అన్నాడు. తమ మధ్య బ్రేకప్ జరగలేదని చెప్పాడు. కానీ, కొత్త ఏడాది సందర్భంగా బ్రేకప్ విషయాన్ని దీప్తి సునయన అనౌన్స్ చేసేసింది. దాంతో షణ్ముక్ జస్వంత్ కూడా అందుకు యాక్సెప్ట్ చేసేశాడు.

Shanmukh , siri comments on Shanmukh deepthi sunaina break up
Bigg Boss 5 Telugu Shanmukh : దీప్తి సునయనకు ఆ హక్కు ఉందన్న షణ్ముక్ జస్వంత్..
దీప్తి సునయనకు బ్రేకప్ డెసిషన్ తీసుకునే రైట్ ఉందని, ఆమె ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని తాను కోరుకుంటున్నానని ఈ సందర్భంగా షణ్ముక్ జస్వంత్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. అయితే, ఈ బ్రేకప్‌కు సిరి హన్మంత్ కారణమని చాలా మంది సిరిని ట్రోల్ చేస్తున్నారు. సిరిపైన నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, వీటన్నిటికీ సమాధానమిచ్చింది సిరి. తాను ఇఫ్పుడు మరింత స్ట్రాంగ్ అయ్యానని మీనింగ్ వచ్చేలా ఓ మోటివేషనల్ కోట్ షేర్ చేసింది సిరి. తాను ఎటువంటి ట్రోల్స్‌ను అయినా అస్సలు పట్టించుకోబోనని తన పోస్టు ద్వారా స్పష్టం చేసింది సిరి హన్మంత్.