Anchor Ravi : దొంగ మొహం అన్న.. యాంకర్ రవి పరువుతీసిన సిరి

Authored By Cinema Desk | The Telugu News | Published on: January 16, 2022, 7:00 pm

Anchor Ravi : యాంకర్ రవి కుకింగ్ స్పెషలిస్ట్ అన్న సంగతి తెలిసిందే. అలా అని అందరికీ వండి పెట్టేయగల సత్తా ఏమీ లేదు. తన పాప కోసం ఆ మాత్రం వండటం నేర్చుకున్నాడు. ఎందుకంటే తన పాపకు ప్రేమగా వండి పెట్టడం ఇష్టం కాబట్టి. అలా తన తండ్రి ప్రేమగా వండిన వాటిని వియా ఫుల్లుగా ఆరగిస్తుంది. అలా వియా కోసం గతంలో స్పెషల్ డిషెస్‌ను యాంకర్ రవి వండిన సంగతి తెలిసిందే.

యాంకర్ రవి అలా తన పాప కోసం స్పెషల్ వంటకాలు అంటే.. చికెన్, మటన్ వంటి వాటిని వండుతాన్న విషయం తెలిసిందే. కనుమ సందర్బంగా తన పాప కోసం మటన్ కూరను రవి వండాడు. దీనికి సంబంధించిన వీడియోను రవి షేర్ చేశాడు. హ్యాపీ కనుమ.. ఫుల్లుగా కుమ్మేయండి.. నేను కూడా అదే పనిలో ఉన్నాను అని చెప్పుకొచ్చాడు. అయితే ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

siri hanmanth satires on anchor ravi

siri hanmanth satires on anchor ravi

Anchor Ravi  : రవి వంటపై సిరి సెటైర్లు..

ఈ క్రమంలో సిరి హన్మంత్ కూడా కామెంట్ చేసింది. బిగ్ బాస్ ఇంట్లో ఉండగా వంటలు రావు అని చెప్పి.. ఇప్పుడు వండుతావా? దొంగ మొహం అన్నా అంటూ సిరి కామెంట్ చేసి రవి పరువుతీసింది. అయితే రవి అన్నా.. అలా ఏం అనలేదు.. ఎక్కువ మందికి వండలేను అని చెప్పాడు.. మరి నువ్వేం చేశావ్ అంటూ సిరి మీద నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp