Anchor Ravi : సుడిగాలి సుధీర్ వివాదాస్పద స్కిట్‌తో యాంకర్ రవికి వార్నింగ్ ఆడియో..?
ప్రధానాంశాలు:
Anchor Ravi : సుడిగాలి సుధీర్ వివాదాస్పద స్కిట్‌తో యాంకర్ రవికి వార్నింగ్ ఆడియో..?
Anchor Ravi : యాంకర్ రవి, సుడిగాలి సుధీర్ sudigali sudheer ఇద్దరూ బుల్లితెరపై మంచి క్రేజ్ తెచ్చుకున్న సెలెబ్రిటీలు కాగా,తాజాగా వీరిద్దరు కలిసి ఓ షోన హోస్ట్ చేశారు. ఈ టీవీ కార్యక్రమానికి సీనియర్ హీరోయిన్ రంభ అతిథిగా హాజరయ్యారు. దీనితో సుధీర్, రవి ఇద్దరూ బావగారు బాగున్నారా చిత్రంలోని సన్నివేశాన్ని స్పూఫ్ చేశారు. సాధారణంగా హిందువులు శివాలయానికి వెళ్ళినప్పుడు నందీశ్వరుడి తలపై నుంచి శివుణ్ణి దర్శించుకుంటారు. బావగారు బాగున్నారా చిత్రంలో చిరంజీవి నందీశ్వరుడి తలపై నుంచి శివుణ్ణి చూసే క్రమంలో రంభ ఎంట్రీ ఇస్తుంది.

Anchor Ravi : సుడిగాలి సుధీర్ వివాదాస్పద స్కిట్‌తో యాంకర్ రవికి వార్నింగ్ ఆడియో..?
Anchor Ravi మాది తప్పు లేదు..
స్వామివారి దర్శనం అయిందా అని అడిగితే.. నాకు అమ్మవారి దర్శనం అవుతోంది అని చిరంజీవి చెప్పే డైలాగ్ బావగారు బాగున్నారా చిత్రంలో ఉంది. ఇదే సన్నివేశాన్ని సుడిగాలి సుధీర్, యాంకర్ రవి రీ క్రియేట్ చేశారు. సుధీర్ నందీశ్వరుడి తలపై నుంచి రంభని చూస్తాడు. హిందువుల మనోభావాలను కించపరిచేలా, హిందూ దేవుళ్ళని అనుమానించేలా సుధీర్, యాంకర్ రవి ప్రవర్తించారు అంటూ హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. సుధీర్, యాంకర్ రవి ఇద్దరూ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నారు.
తాజాగా రాష్ట్రీయ వానరసేన అనే హిందూ ఆర్గనైజేషన్ నుంచి కేశవరెడ్డి అనే వ్యక్తి యాంకర్ రవికి ఫోన్ చేశారు. ఆ కాల్ రికార్డింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా టివి షోలో ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చింది అని ఆయన యాంకర్ రవిని ప్రశ్నించారు. నందీశ్వరుడి నుంచి శివుడిని చూడాల్సింది పోయి అమ్మాయి కనిపిస్తోంది అని ఎలా అంటారు అని నిలదీశారు. యాంకర్ రవి సమాధానం ఇస్తూ అది చిరంజీవి గారు నటించిన సన్నివేశం అని అన్నారు. వాళ్ళు తప్పుచేస్తే మీరు కూడా తప్పు చేస్తారా అని రవిని తిరిగి ప్రశ్నించారు. ఆ సన్నివేశం చేసేటప్పుడు షూ కూడా విప్పేసి నటించాము. అక్కడ ఎవరినీ కించపరచలేదు. మీకు ఈ విషయంలో ఇంకా క్లారిటీ కావాలి అనుకుంటే జీ తెలుగు స్టూడియోకి వెళ్లి అడగండి అని రవి సమాధానం ఇచ్చారు.
సుడిగాలి సుధీర్ వివాదాస్పద స్కిట్.. యాంకర్ రవికి వార్నింగ్ ఆడియో కాల్ లీక్
బావగారు బాగున్నారా సినిమా సీన్‌ను రీక్రియేట్ చేసిన సుధీర్.
రాష్ట్రీయ వానర సేన హిందూ ఆర్గనైజేషన్ నుంచి రవికి వార్నింగ్.
హిందూ సమాజాన్ని కించపరుచుకుంటూ పరాచకాలు చేస్తున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన… https://t.co/0d71LAWoqu pic.twitter.com/J67DSuWzV2— ChotaNews App (@ChotaNewsApp) April 11, 2025