
Siri Hanumanth mass dance video
Siri Hanumanth : సిరి హనుమంత్ అంటే తెలుగు ప్రేక్షకులలో తెలియని వారు ఉండరు. తన అందం, నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. యూట్యూబ్ ద్వారా బాగా పాపులర్ అయిన సిరి ఆ తర్వాత వెబ్ సిరీస్ సీరియస్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక బిగ్ బాస్ ద్వారా ఓ రెంజ్ లో క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత ఇద్దరి లోకం ఒకటే, ఒరేయ్ బుజ్జిగా వంటి సినిమాలలో కూడా నటించింది. సిరి సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను, వీడియోలను ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
అయితే ఇటీవల సిరి బుల్లితెరలో ప్రసారమయ్యే స్టార్ మా పరివారంలో పాల్గొని సందడి చేసింది. ఇక ఈ ప్రోగ్రాంలో మాస్ డాన్స్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. స్టార్ పరివారం కార్యక్రమానికి హోస్ట్ గా శ్రీముఖి చేస్తుంది. సిరి తో పాటు సన్నీ, ఆర్జె కాజల్, మానస్, అమ్మ రాజశేఖర్, అరియానా గోరి, ముక్కు అవినాష్ లు పాల్గొని అందరిని ఎంటర్టైన్ చేశారు. ఇక ఈ ప్రోగ్రాం లో పాల్గొన్న సిరి ఒక టాస్క్ లో భాగంగా మాస్ డాన్స్ వేస్తుంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సూపర్ డూపర్ హిట్ సినిమా అత్తారింటికి దారేది సినిమాలోని బాబు గారి బొమ్మ అనే పాటకు సిరి డాన్స్ చేసి దుమ్ము లేపేసింది.
Siri Hanumanth mass dance video
ముందుగా క్లాస్ స్టెప్పులతో మొదలుపెట్టిన సిరి ఆ తర్వాత మాస్ స్టెప్పులు వేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో సిరికి సంబంధించిన ఈ మాస్ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఏది ఏమైనా బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన కంటెస్టెంట్లు అందరూ సోషల్ మీడియా ద్వారా ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 5 లో సిరి కంటెస్టెంట్గా చేరి ప్రేక్షకులను నుంచి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
This website uses cookies.