Siri Hanumanth : ఊర మాస్ స్టెప్పులతో డాన్స్ ఇరగదీసిన సిరి.. చూస్తే షేక్ అయిపోతారు .. వీడియో

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: December 1, 2022, 9:00 pm

Siri Hanumanth : సిరి హనుమంత్ అంటే తెలుగు ప్రేక్షకులలో తెలియని వారు ఉండరు. తన అందం, నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. యూట్యూబ్ ద్వారా బాగా పాపులర్ అయిన సిరి ఆ తర్వాత వెబ్ సిరీస్ సీరియస్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక బిగ్ బాస్ ద్వారా ఓ రెంజ్ లో క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత ఇద్దరి లోకం ఒకటే, ఒరేయ్ బుజ్జిగా వంటి సినిమాలలో కూడా నటించింది. సిరి సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను, వీడియోలను ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

అయితే ఇటీవల సిరి బుల్లితెరలో ప్రసారమయ్యే స్టార్ మా పరివారంలో పాల్గొని సందడి చేసింది. ఇక ఈ ప్రోగ్రాంలో మాస్ డాన్స్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. స్టార్ పరివారం కార్యక్రమానికి హోస్ట్ గా శ్రీముఖి చేస్తుంది. సిరి తో పాటు సన్నీ, ఆర్జె కాజల్, మానస్, అమ్మ రాజశేఖర్, అరియానా గోరి, ముక్కు అవినాష్ లు పాల్గొని అందరిని ఎంటర్టైన్ చేశారు. ఇక ఈ ప్రోగ్రాం లో పాల్గొన్న సిరి ఒక టాస్క్ లో భాగంగా మాస్ డాన్స్ వేస్తుంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సూపర్ డూపర్ హిట్ సినిమా అత్తారింటికి దారేది సినిమాలోని బాబు గారి బొమ్మ అనే పాటకు సిరి డాన్స్ చేసి దుమ్ము లేపేసింది.

Siri Hanumanth mass dance video

Siri Hanumanth mass dance video

ముందుగా క్లాస్ స్టెప్పులతో మొదలుపెట్టిన సిరి ఆ తర్వాత మాస్ స్టెప్పులు వేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో సిరికి సంబంధించిన ఈ మాస్ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఏది ఏమైనా బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన కంటెస్టెంట్లు అందరూ సోషల్ మీడియా ద్వారా ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 5 లో సిరి కంటెస్టెంట్గా చేరి ప్రేక్షకులను నుంచి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  2. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  3. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  4. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  5. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

  6. "Vijay Deverakonda Sukumar : విజయ్‌కు సుకుమార్ సినిమా పడితే కెరీర్ టర్నింగ్ పాయింటేనా? ఆరేళ్లుగా ఎదురుచూపులు!"

  7. "AP Local Body Elections : ఏపీలో కూటమి మాస్టర్ ప్లాన్.. బీసీలకు అదనపు టికెట్లు, మహిళలకు పెద్దపీట!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp