Shanmukh : బాత్రూం ఏరియాలో సిరి, షణ్ముఖ్ ల రొమాన్స్… వెనకాల నుంచి గట్టిగా హత్తుకుని మరి..!

Advertisement

Shanmukh : షణ్ముఖ్ బిగ్ బాస్ సీజన్ ముగింపుకు మరో కొద్ది గంటలే మిగిలి ఉంది. ప్రతీ సీజన్ లో ఏదో ఒక జంట లవ్ ట్రాక్ ద్వారా ఫేమస్ అవ్వగా.. ఈ సీజన్ లో మాత్రం అందరూ ఎక్కువగా మాట్లాడుకున్నది సిరి,షణ్ముఖ్ బంధం గురించే. బిగ్ బాస్ కంటే ముందునుంచే స్నేహితులైన వీరు…హౌస్ లోకి వచ్చాక బాగా క్లోజ్ అయ్యారు. ఓ రోజు గొడవపడతారు. ఆ మరుసటి రోజే మళ్ళీ రోజు క్లోజ్ అయిపోతారు. అలగటాలు, హగ్గులు, కిస్సులు ఇచ్చుకుంటారు. ఒక పక్క మేం ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూనే.. అసభ్యంగా రొమాన్స్ చేస్తుంటారు. ఓ వైపు ఇంటి సభ్యులు, మరోవైపు బయటి ప్రేక్షకులు వీళ్ళ గురించి అర్ధం కాక తల పగలకొట్టుకున్నారు.

Advertisement

ఇదిలా ఉండగా నిన్న ప్రసారమైన అన్ సీన్‌ ఎపిసోడ్‌లో సిరి, షణ్ముఖ్ లు మరోసారి రెచ్చిపోయారు.ఆట ముగింపుకు వచ్చినా షణ్ముఖ్ సిరి వ్యవహారం మాత్రం ఏమాత్రం మారడం లేదు. సిరిని పెళ్లాం అంటూ సంబోధించిన షణ్ముఖ్… నువ్వు నాకు పడిపోయావ్ సిరి అంటూ ఆమె ఒళ్లో తల పెట్టుకుని పడుకున్నాడు. నాతో ఉన్న ఫోటోలను బెడ్ మీద పెట్టుకున్నావ్ అంటే నువ్వు నాకు పడిపోయినట్టే అంటూ సిరిని ఆట పట్టించాడు. పెళ్లాం చేసినట్టుగా నాకు సేవలు చేయకు అంటూ బిగ్ బాస్ స్టైల్లో వాయిస్ ఇమిటేట్ చేసి ఆమెను ఏడిపించాడు. ఇదంతా ఒకే గానీ బాత్రూంలోకి లో వీరు చేసిన రచ్చే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Advertisement
siri Shanmukh romance in bigg boss 5 Telugu went viral in social media
siri Shanmukh romance in bigg boss 5 Telugu went viral in social media

Shanmukh : శృతి మించిన షణ్ముఖ్ సిరిల సరసాలు..:

బాత్రూంలో స్నానానికి వెళ్లిన సిరిని.. ఆట పట్టించడానికి వెళ్లిన షన్ను.. ఆమెతో కాసేపు సరదా ఆటలాడాడు. కాకపోతే ఆట కాస్త శృతి మించి అసభ్యకరంగా తయారైంది. బాత్రూం ఏరియాలో అలకలో ఉన్న సిరిని షణ్ముఖ్ ఓదార్చిన విధానం షాక్ కు గురి చేసింది. సిరి, షణ్ముఖ్ ల హత్తుకున్న విధానానికి జనాలు నోరెళ్ళబెట్టారు. ఎవరు లేని చోట వీరిద్దరి రొమాన్స్ ను జనాలు చూడలేకపోయారు. బయట వీరిద్దరికీ వేరు వేరుగా పెయిర్స్ ఉన్నా.. హౌజ్ లోపల వీరి రిలేషన్ ఏంటో ఆట ముగింపుకు వచ్చినా ఎవ్వరికీ అర్థం కావడం లేదు.

Advertisement
Advertisement