Sitara : చిరు న‌వ్వులు చిందిస్తూ సితార ఎంత క్యూట్‌గా క‌నిపిస్తుంది..!

Authored By Sam C | The Telugu News | Published on: March 28, 2022, 6:00 pm

Sitara : మ‌హేష్ బాబు గారాల ప‌ట్టి సితార సినిమాల‌లోకి ఎంట్రీ ఇవ్వ‌క‌ముందే అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కించుకుంది. ముఖ్యంగా సోష‌ల్ మీడియా ద్వారా సితార‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల తనయ సితార ఘట్టమనేనిని ఫ్యాన్స్ ఫాలో అవుతుంటారు. ఇక సితార, మహేష్ కలిసి చేసే అల్లరి మామూలుగా ఉండదు. అయితే కొన్ని రోజుల నుంచి సితార ఎక్కువగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ వచ్చింది. ఆనీ మాస్టర్ నేతృత్వంలో సితార డ్యాన్స్ నేర్చుకుంటూ వచ్చింది. అయితే అదేదో టైం పాస్ కాదని, సర్కారు వారి పాట సినిమా కోసమని తాజాగా తెలిసి వచ్చింది.

ఇటీవ‌ల విడుద‌లైన పెన్నీ సాంగ్‌లో సితార ప‌ర్‌ఫార్మెన్స్ చూసి ప్ర‌తి ఒక్క‌రు మైమ‌ర‌చిపోయారు.స‌ర్కారు వారి పాటలోని సెకండ్ సింగిల్ పెన్నీ పాటలో సితార మెరిసింది. ఆమె వేసిన స్టెప్పులకు ఘట్టమనేని అభిమానులు మాత్రమే కాదు.. సినీ ప్రేమికులంతా ఫిదా అవుతున్నారు. ఇలా సితార తెరపై కనిపించడం ఇదే మొదటి సారి. పైగా తండ్రి సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇలా సితార రాక్ స్టార్ అవతరాన్ని ఎత్తేసింది. ఇక సితార వేసిన స్టెప్పులను, స్క్రీన్ ప్రజెన్స్ చూసి ఆనీ మాస్టర్ గురువుగా మురిసిపోయింది. రాక్ స్టార్ అంటూ ఆనీ మాస్టర్ ప్రశంసలు కురిపించింది. నా తొలి పరిచయాన్ని ఇంత స్పెషల్ చేసినందుకు థ్యాంక్స్ అంటూ సితార ఎమోషనల్ అయింది.

sitara beautiful looks viral

sitara beautiful looks viral

Sitara : సితార మెస్మ‌రైజింగ్ లుక్స్..

ఇక నమ్రత శిరోద్కర్ సైతం రాక్ స్టార్ అంటూ మురిసిపోయింది. నమ్రత సోదరి శిల్పా శిరోద్కర్ సైతం సంబరపడిపోయింది.సితార ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ అల‌రిస్తూ వ‌స్తుంది. తాజాగా ఈ చిన్నారి పొట్టి డ్రెస్‌లో క్యూట్ స్మైల్ ఇస్తూ అంద‌రి దృష్టి ఆక‌ర్షిస్తుంది. సితార క్యూట్ లుక్స్ చూసి మైమ‌ర‌చిపోతున్నారు. సితార రానున్న రోజుల‌లో టాలీవుడ్ ని షేక్ చేయ‌డం ఖాయం అని అంటున్నారు. ప్ర‌స్తుతం సితార క్యూట్ లుక్స్ సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. సితార పిక్ అలా పిక్ పోస్ట్ చేసిందో లేదో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అయింది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp