Sitara : దీపావ‌ళి స్పెష‌ల్.. సితార‌ ప‌ర్‌ఫార్మెన్స్ చూసి మైండ్ బ్లాక్ అయింద‌న్న మహేష్ బాబు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sitara : దీపావ‌ళి స్పెష‌ల్.. సితార‌ ప‌ర్‌ఫార్మెన్స్ చూసి మైండ్ బ్లాక్ అయింద‌న్న మహేష్ బాబు

Sitara : దీపావ‌ళి వేడుక‌లు దేశ వ్యాప్తంగా ఘ‌నంగా జ‌రిగాయి. సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు సైతం ఈ వేడుక ఘ‌నంగా జ‌రుపుకున్నారు. ఇక దీపావ‌ళి వేడుక సంద‌ర్భంగా మ‌హేష్ బాబు తన కూతురు శాస్త్రీయ నృత్యం చేస్తోన్న వీడియోను తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు మహేష్ బాబు… నువ్వు ఎప్పుడు గర్వపడేలా చేస్తావు అంటూ రాసుకొచ్చారు. నువ్వు నన్ను గర్వపడేలా చేయడంలో ఎప్పుడూ విఫలం కావు. మై లిటిల్ వన్. […]

 Authored By sandeep | The Telugu News | Updated on :25 October 2022,2:40 pm

Sitara : దీపావ‌ళి వేడుక‌లు దేశ వ్యాప్తంగా ఘ‌నంగా జ‌రిగాయి. సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు సైతం ఈ వేడుక ఘ‌నంగా జ‌రుపుకున్నారు. ఇక దీపావ‌ళి వేడుక సంద‌ర్భంగా మ‌హేష్ బాబు తన కూతురు శాస్త్రీయ నృత్యం చేస్తోన్న వీడియోను తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు మహేష్ బాబు… నువ్వు ఎప్పుడు గర్వపడేలా చేస్తావు అంటూ రాసుకొచ్చారు. నువ్వు నన్ను గర్వపడేలా చేయడంలో ఎప్పుడూ విఫలం కావు. మై లిటిల్ వన్. దీపావళి శుభాకాంక్షలు అంటూ సితార‌ భారతనాట్యం చేస్తున్న వీడియోను షేర్ చేశారు మహేష్.

సితార డ్యాన్స్ వీడియో మ‌హేష్ అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. సితార టాలెంట్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. చిన్న‌వ‌య‌స్సు నుండి ఎంతో యాక్టివ్‌గా ఉంటూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. చదువులోనే కాకుండా అన్నింటిలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. తన స్నేహితురాలితో కలిసి ఏకంగా ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి అందరితో శభాష్ అనిపించుకుంది. పాటలు.. డ్యాన్స్.. ఆటలు ఒక్కటేమిటి అన్నింట్లోనూ తన టాలెంట్ ను ప్రదర్శిస్తోంది. తాజాగా త‌న గురువు మ‌హ‌తి భిక్షుతో కలిసి అద్భుతమైన హావభావాలతో ఎంతో అందంగా నృత్యం చేస్తుంది.

Sitara Dance Video on instagram

Sitara Dance Video on instagram

Sitara : క్యూట్ ప‌ర్‌ఫార్మెన్స్…

సితార డ్యాన్స్‌ని చూసి ప్ర‌తి ఒక్క‌రు థ్రిలో అవుతున్నారు. ఇక మ‌హేష్ విషయానికి వ‌స్తే చివ‌రిగా స‌ర్కారు వారి పాట‌తో మంచి హిట్ కొట్ట‌గా, ప్ర‌స్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీ తర్వాత జక్కన్న దర్శకత్వంలో భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాపై మ‌హేష్ అభిమానులు భారీ అంచ‌నాలే పెట్టుకున్నారు. ఈ సినిమా ఎంత‌గా ర‌చ్చ చేస్తుందో అని ప్రతి ఒక్క‌రు ఆలోచ‌న చేస్తున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది