Sitara : సితార మాముల్ది కాదు.. మ‌హేష్ బాబునే బోల్తా కొట్టించిందిగా..!

Authored By Sam C | The Telugu News | Published on: September 13, 2022, 9:30 pm

Sitara : సూపర్ స్టార్ మ‌హేష్ బాబు ముద్దులు కూతురు సితార గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. సినిమాల‌లోకి రాకుండానే విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలొయింగ్ సంపాదించింది సితార‌. ఈ చిన్నారి సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తెగ సంద‌డి చేస్తుంటుంది. ముఖ్యంగా త‌న తండ్రితో చేసే హంగామా మాములుగా ఉండ‌దు. ఇటీవలే త‌న‌ స్వీట్ డాడ్ మ‌హేష్‌తో క‌లిసి డాన్స్ ఇండియా డాన్స్ ప్రోగ్రామ్ కి సితార హాజరైన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రోమోల‌, ఫోటోలు సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేశాయి. ఇది చూసి అభిమానులు కూడా తెగ మురిసిపోయారు.

ఇక ఆ షోని తండ్రి-కుమార్తెలిద్దరు తెగ ఎంజాయ్ చేసారు. షోలో పిల్లి గిన్నిలో వేడి వేడి పాలు తాగితే ఏమవుతుందని ఓ ప్రశ్న వేస్తుంది సీతాపాప. దానికి మహేష్ గెడ్డం పట్టుకుని సీరియస్ గా ఆలోచిస్తాడు. చివరిగా చించి చించి మూతి కాలిపోద్దమ్మా అంటాడు. దానికి సితార క్యూట్ గా కాదు అంటుంది. సరే మరేం? అవుద్ది అంటే? బౌల్ ఖాళీ అయిపోతుందని పంచ్ వేస్తుంది. బ్యాక్ గ్రౌండ్ లో శెభాష్ శెభాష్ అంటూ వాయిస్ ఓవర్ వస్తుంది. జబర్దస్త్ తరహాలో జోక్ భలే పేలిందని ఆడియన్స్ అంతా పగలబడి నవ్వుతారు. కుమార్తె చేతిలో మ‌హేష్ ఇలా బోల్తా ప‌డ‌డంతో ఆ సరదా మూవ్ మెంట్ని తాను ఎంతో ఎంజాయ్ చేసాడు. తండ్రికి తగ్గ తనయ అని మురిసిపోయాడు.

sitara fun with father

sitara fun with father

Sitara : పంచ్ అదిరింది..!

మొత్తానికి సెటైర్లు..పంచ్ లు వేయడంలో! సితార తండ్రి నోటి నుంచి ఊడిపడినట్లే కనిపిస్తుంది. అంతేనా? సితార మంచి డాన్సర్ కూడా. సోషల్ మీడియా వేదికగా తన ప్రతిభను చాటుతూనే ఉంటుంది. సర్కారు వారి పాటలో పెన్ని సాంగ్ కి సితార డాన్స్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆ పాట వీడియోని సోషల్ మీడియా వరకే పరిమితం చేసారు. సినిమా లెంగ్త్ పెరిగిపోవడంతో సితార డాన్స్ ని ఎడిట్ చేసి సినిమా రిలీజ్ చేసారు. ఆరకంగా సితార డెబ్యూ మిస్ అయింది. రానున్న రోజుల‌లో మ‌హేష్ త‌న కూతురిని త‌ప్ప‌క హీరోయిన్‌ని చేయ‌డంలో ఆశ్చ‌ర్యం లేద‌నే టాక్ కూడా వినిపిస్తుంది.

Sam C

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp