Sneha Reddy : హీరోయిన్స్‌ని మించి అందాలు ఆర‌బోస్తున్న బ‌న్నీ వైఫ్‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

Authored By Sam C | The Telugu News | Published on: August 14, 2022, 1:40 pm

Sneha Reddy : అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న స్నేహా రెడ్డిని 8.3 మిలియన్ ఫ్యాన్స్ ఫాలో అవుతున్నారు. బన్నీ సినిమాలు, టూర్లకు సంబంధించిన అప్‌డేట్స్‌, ఫొటోలు, వీడియోలతో పాటు వారి పిల్లలకు సంబంధించిన క్యూట్‌ వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్‌ చేస్తుంటుందీ . అప్పుడ‌ప్పుడు తన గ్లామరస్‌ అండ్‌ ఫ్యాషనబుల్‌ ఫొటోలు, వీడియోలను ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది. వీటికి అభిమానుల నుంచి ఊహించని స్పందన వస్తుంటుంది. ఇటీవ‌ల బ్లాక్ కలర్‌ డ్రెస్‌లో సూపర్‌ స్టైలిష్‌ లుక్‌లో కనిపించింది స్నేహ.

Sneha Reddy : ఆహా .. అనిపించే స్నేహా అందం..

ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ జుకల్కర్ డిజైన్ చేసిన ధుస్తుల‌లో స్ట‌న్నింగ్ లుక్స్‌తో క‌నిపించ‌గా, వాటికి మెగా డాటర్స్‌ నిహారిక, సుష్మిత కొణిదెల సహా పలువురు సెలబ్రిటీలు సూపర్‌ హాట్‌ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తుంటే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఎమోజీలు, లైకులు కురిపించారు. కొంద‌రు నెటిజ‌న్స్ మాత్రం మీకు ఇలాంటివి అవ‌స‌రమా అని కామెంట్స్ చేశారు. కాని అవేమి ప‌ట్టించుకోని స్నేహా రెడ్డి తాజాగా డిఫ‌రెంట్ శారీలో అందాల ఆర‌బోత‌తో రెచ్చ‌గొట్టింది. మేడమ్ సార్ మేడ‌మ్ అంతే… అని కొంద‌రు కామెంట్స్ చేస్తుండ‌గా, మ‌రి కొంద‌రు అదిరిపోయావు అని క్యూట్ కామెంట్స్ చేస్తున్నారు.

sneha Reddy saree looks trending

sneha Reddy saree looks trending

ఇక కొంద‌రు నెటిజ‌న్స్ మాత్రం ఎప్ప‌టిలానే స్నేహా రెడ్డి లుక్స్‌పై మండిప‌డుతూ ట్వీట్స్ చేస్తున్నారు. మరికొందరైతే మీరు హీరోయిన్ కావాల్సింది పొరపాటున అటువైపు వెళ్లలేదని కామెంట్ చేశారు. స్నేహారెడ్డి గ్లామర్ చూస్తే ఎవరికైనా ఈ అభిప్రాయం కలగాల్సిందే. 2011 మార్చ్ 6న స్నేహారెడ్డిని అల్లు అర్జున్ ప్రేమ వివాహం చేసుకున్నారు. చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా వెనక్కి తగ్గకుండా ప్రేమను గెలిపించుకున్నారు ఈ జంట. ఇక పుష్పతో పాన్‌ ఇండియా స్థాయిలో క్రేజ్‌ తెచ్చుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌ను రెడీ చేసే పనిలో ఉన్నారు. పుష్ప..ది రూల్‌ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రం షూటింగ్‌ త్వరలోనే పట్టాలెక్కనుంది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp