Allu Arjun Sneha Reddy : దీనిని కూడా శోభనం గదిలోకి తీసుకెళ్లిన బన్నీ… దానిని చూసి స్నేహ రెడ్డి షాక్…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Allu Arjun Sneha Reddy : దీనిని కూడా శోభనం గదిలోకి తీసుకెళ్లిన బన్నీ… దానిని చూసి స్నేహ రెడ్డి షాక్…!

 Authored By jyothi | The Telugu News | Updated on :21 December 2023,9:00 am

ప్రధానాంశాలు:

  •  Allu Arjun Sneha Reddy : దీనిని కూడా శోభనం గదిలోకి తీసుకెళ్లిన బన్నీ... దానిని చూసి స్నేహ రెడ్డి షాక్...!

Allu Arjun Sneha Reddy : మనకి స్టైల్ అంటే గుర్తొచ్చేది మొదట బన్నీ పేరే.. అల్లు అర్జున్ పుష్ప2 సినిమాలో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.. ఈ సినిమాలో కంప్లీట్ డిఫరెంట్ లుక్ తో కనిపించాడు అల్లు అర్జున్.. స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన కొన్ని వార్తలు ఎక్కువగా ట్రెండ్ అవుతూ ఉంటాయి.. అలాంటి విషయమై ఇప్పుడు మన అల్లు అర్జున్ విషయంలో కూడా జరిగింది. ఇది వినడానికి ఆశ్చర్యంగా అనిపించిన వాస్తవం ఇదే అంటూ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ సంబంధించిన ఓ వార్త చెక్కర్లు కొడుతోంది.. సోషల్ మీడియా అందుబాటులో వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన పర్సనల్ విషయాలు కూడా తెగ వైరల్ అవుతుంది.. వాళ్ల లైఫ్ లోకి లోతుగా వెళ్లి విషయాలు తెలుసుకోవడంలో జనాలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

తాజాగా అల్లు అర్జున్ పర్సనల్ లైఫ్ లోకి సంబంధించిన ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది..  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎంత నాటి అన్న సంగతి అందరికీ తెలిసిందే.. పెళ్ళికి ముందు ఏ విధంగా ఉన్నాడో.. పెళ్లి తర్వాత పిల్లలు తర్వాత కూడా అల్లు అర్జున్ చాలా నాటిగా ఉండడం మనం చూస్తున్నాము.. అయితే ఫస్ట్ నుంచి అల్లు అర్జున్ కి ఒక హాబిట్ ఉండేది. తను పడుకునే ముందు ఆరోజు ఏం జరిగిందో తను తన డైరీలో రాసుకునేవాడట.. ఇప్పటికి కూడా అల్లు అర్జున్ అలానే చేస్తాడట. అయితే అన్ని రోజులు ఓకే మరి.. పెళ్లయిన మొదటి రాత్రి కూడా డైరీ ని అలాగే తీసుకెళ్తారా.? అంటే అల్లు అర్జున్ చేసిన పని అది అని చెప్పాలి. అల్లు అర్జున్ తన మొదటి రాత్రి గదిలోకి ఆయన డైరీ ని కూడా తీసుకెళ్లారట. అది చూసి ఒక్కసారిగా స్నేహ రెడ్డి ఆశ్చర్యపోయారట. అలాగే ఈ విషయం తెలుసుకున్న అల్లు అరవింద్ కూడా తెగ నవ్వుకున్నారట.. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే స్నేహ రెడ్డి అల్లు అర్జున్ మంచి కపుల్స్ అని చెప్పుకోవాలి. ఇండస్ట్రీలో ఎన్ని జంటలు ఉన్నా సరే ఈరోజుకి కూడా ఈ ఇద్దరు జంట చాలా ముచ్చటగా ఉంటుంది.. చూడడానికి కూడా చాలా సంప్రదాయంగా అనిపిస్తూ ఉంటుంది.. అలాగే తన పిల్లలు తన భార్యతో కూడా అల్లు అర్జున్ సరదాగా గడపడం మనం చూస్తూనే ఉన్నాం.. ఐ కాన్ స్టార్ ఎంత బిజీగా ఉన్నాసరే.. తన ఫ్యామిలీతో కూడా అంతే ఎంజాయ్ చేస్తాడు..

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది