Allu Arjun And Sneha Reddy : మంచిగా ఉండే బన్నీ- స్నేహ మధ్య గొడవలా.. వారి వల్లేనంటూ నెటిజన్స్ కామెంట్స్..!
ప్రధానాంశాలు:
Allu Arjun And Sneha Reddy : మంచిగా ఉండే బన్నీ- స్నేహ మధ్య గొడవలా.. వారి వల్లేనంటూ నెటిజన్స్ కామెంట్స్..!
Allu Arjun And Sneha Reddy : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే క్యూట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న వారిలో అల్లు అర్జున్- స్నేహా రెడ్డి జంట ఒకటి. వారు ప్రేమించి పెళ్లి చేసుకోగా, ఇప్పటికీ ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. ఇక ఈ జంటకి అయాన్, అర్హ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎంతో క్యూట్ ఫ్యామిలీగా వీరి ఫ్యామిలీని చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు స్నేహా రెడ్డి తన పిల్లలకి సంబందించిన ఫొటోలు లేదంటే బన్నీకి సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని అలరిస్తూ ఉంటుంది. అల్లు అర్జున్- స్నేహా రెడ్డి జంట చాలా మందికి ఆదర్శమనే చెప్పాలి. ఎలాంటి పొరపచ్చాలు రాకుండా సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తున్న ఈ జంటకి సంబంధించిన వార్త ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తుంది.
2011లో స్నేహారెడ్డిని అల్లు అర్జున్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. విద్యాసంస్థలకు అధిపతి అయిన చంద్రశేఖర్ రెడ్డి కుమార్తెనే స్నేహ రెడ్డి. కామన్ ఫ్రెండ్ ద్వారా వారిద్దరికి పరిచయం ఏర్పడడం ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారడం జరిగింది. చంద్రశేఖర్ రెడ్డి సినిమా వాళ్లకు అమ్మాయిని ఇవ్వను అన్నా కూడా స్నేహా రెడ్డి పట్టుబట్టడంతో బన్నీకి ఇచ్చి వివాహం చేయక తప్పలేదు. అయితే గతంలో ఎప్పుడు పెద్దగా గొడవలు పడని బన్నీ- స్నేహాలు ఇప్పుడు చీటికి మాటికి గొడవలు పడుతున్నారట.పిల్లలను గారాబం చేయకూడదు. భయపెట్టాల్సిన సమయంలో భయపెట్టాలని స్నేహారెడ్డి అంటుందట. అల్లు అర్జున్ మాత్రం పిల్లల విపరీతంగా గారాబం చేస్తాడట. అడిగిన వెంటనే కాదనకుండా ఇచ్చేస్తాడట.

Allu Arjun And Sneha Reddy : మంచిగా ఉండే బన్నీ- స్నేహ మధ్య గొడవలా.. వారి వల్లేనంటూ నెటిజన్స్ కామెంట్స్..!
ఇలా చేస్తే పిల్లల్లో స్ట్రాంగ్, ఇండిపెండెంట్ గా ఉండే లక్షణాలు కొరవడతాయని, లైఫ్ లో పోరాడే తత్త్వం కోల్పోతారని స్నేహా రెడ్డి గట్టిగా చెబుతుందట. అయిన కూడా పిల్లలను గారాబం చేసి, సున్నితంగా ఉండేలా తయారు చేస్తున్నాడట బన్నీ. ఈ విషయంలో ఇద్దరి మధ్య బాగా గొడవలు జరుగుతున్నాయని టాక్. అయితే అల్లు అర్జున్ – స్నేహారెడ్డి మధ్య విభేదాలు రావడమేంటంటూ అభిమానులు అయోమయానికి గురవుతున్నారు. వేరే ఎవరైనా అసత్య ప్రచారం చేస్తున్నారా? అంటూ ఆరా తీస్తున్నారు. ఇలా ఆరా తీసే క్రమంలో వీరిద్దరి మధ్య వచ్చిన విభేదాలు విడాకులు తీసుకునేంత పెద్దవి కావని, చిలిపి తగాదాలేనని తేలింది.