Sonia Akula : ఆర్జీవి భామ బిగ్ బాస్ నుండి ఔట్.. ఈ వీక్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు ఉంటాయన్న నాగార్జున
Sonia Akula : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ పుల్‌గా మూడు వారాలు పూర్తి చేసుకుంది. ముగ్గురు కంటెస్టెంట్స్ బయటకు వచ్చారు. అందరూ ఊహించినట్టే సోనియా ఆకుల మూడో వారం ఎలిమినేట్ అయ్యింది. ఆదివారం కావడంతో నాగ్ హౌస్‌లో ఉన్న వారితో సరదాగా కొన్ని గేమ్స్ ఆడించారు. ఆ తర్వాత నామినేషన్స్ లో ఉన్న ఒకొక్కరిని సేవ్ చేసుకుంటూ వచ్చారు నాగ్. చివరకు సోనియా ఎలిమినేట్ అంటూ ప్రకటించేశారు. స్టేజ్ మీదికి వచ్చిన తరువాత.. నాగార్జున […]
ప్రధానాంశాలు:
Sonia Akula : ఆర్జీవి భామ బిగ్ బాస్ నుండి ఔట్.. ఈ వీక్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు ఉంటాయన్న నాగార్జున
Sonia Akula : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ పుల్‌గా మూడు వారాలు పూర్తి చేసుకుంది. ముగ్గురు కంటెస్టెంట్స్ బయటకు వచ్చారు. అందరూ ఊహించినట్టే సోనియా ఆకుల మూడో వారం ఎలిమినేట్ అయ్యింది. ఆదివారం కావడంతో నాగ్ హౌస్‌లో ఉన్న వారితో సరదాగా కొన్ని గేమ్స్ ఆడించారు. ఆ తర్వాత నామినేషన్స్ లో ఉన్న ఒకొక్కరిని సేవ్ చేసుకుంటూ వచ్చారు నాగ్. చివరకు సోనియా ఎలిమినేట్ అంటూ ప్రకటించేశారు. స్టేజ్ మీదికి వచ్చిన తరువాత.. నాగార్జున సోనియా జర్నీని చూపించారు హౌస్ లోకి వచ్చిన తర్వాత నుంచి సోనియా హ్యాపీ మూమెంట్స్ అలాగే ఎమోషనల్ మూమెంట్స్ అన్ని చూపించారు. దానికి సోనియా గుడ్ వన్ సార్ అని అంది. అయితే ఎలిమినేషన్ సమయంలో సోనియా, ఆదిత్యలో ఆదిత్య సేఫ్ అయ్యాడు. సోనియా ఎలిమినేట్ అయ్యింది.
Sonia Akula బిగ్ ట్విస్ట్..
ఇక్కడే మరో ట్విస్ట్ ఏంటంటే..హౌస్ అంతా జీరో అని ట్యాగ్ వేసిన మణికంఠ కూడా డేంజర్ జోన లో ఉండటంతో.. హౌస్ ఒపీనియన్ తీసుకున్నాడు నాగర్జున. దాదాపు అందరూ మణింకంఠ హౌస్ లో ఉండాలి అనుకున్నారు. నిఖిల్, పృధ్వీ, నైనిక తప్పించి అందరు మణికి సపోర్ట్ చేశారు. దాంతో సోనియా ఎలిమినేట్ అయిపోయి..మణింకఠ సేఫ్ అయ్యాడు. అయితే హౌస్ మణిని డేంజర్ జోన్ లోకి వేశారు కాబట్టి.. బిగ్ బాస్ చెప్పే వరకూ అతను జైల్ రూమ్ లో ఉండబోతున్నాడు. ఈసీజన్ లో ఫస్ట్ జైల్ లోకి అడుగుపెట్టిన మొదటి కంటెస్టెట్ గా మణికంట నిలిచాడు. ఇక ఈ వీక్ లో డబుల్ ఎలిమినేషన్ ఉండబోతోంది. అది కూడా మిడ్ వీక్ లో ఒకరు బయటకువెళ్ళిపోబోతున్నారు. ఈ విషయాన్ని చివరిలో చెప్పి అతి పెద్ద షాక్ ఇచ్చాడు నాగార్జున.
అంతే కాదు ఈ వీక్ లోనే.. ఏదో ఒక టైమ్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండే అవకాశం ఉంది. ఈ విషయాన్ని క్లియర్ గా చెప్పకపోయినా.. చిన్న హిట్ మాత్రం ఇచ్చాడు నాగ్. ఎప్పుడైనా రావచ్చు.. అని అన్నారు. సో నాగార్జున వెళ్తూ.. వెళ్తూ.. ఈ వీక్ లో జరగబోయే అద్భుతాలకు సబంధించిన ఆడియన్స్ ను కన్ ఫ్యూజన్ లో పెట్టి.. వెళ్ళాడు. అటు మిడ్ ఎలిమినేషన్.. ఇటు వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. ఈరెండు ఉండబోతున్నాయి. ఈ వీక్ మిడ్ లో ఎలిమినేట్ అయ్యే వ్యక్తి సీక్రెట్ రూమ్ లోకి వెళ్ళే అవకాశం ఉంది. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎంత మంది ఈ వీక్ లో ఎంటర్ అవ్వబోతున్నారు అనేది చూడాలి. ట్విస్ట్ ఇవ్వాలి అనుకుంటే.. ఇద్దరిని కూడా హౌస్ లోకి పంపే అవకాశం కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..!