Sonia Akula : ఆకుల సోనియా బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. వర్మ టూ బిగ్ బాస్ ప్రయాణం ఎలా ?
Sonia Akula : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం ఎట్టకేలకి ప్రారంభం అయింది.ఈ షోలో 14 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు.అయితే వీరిలో అందరి దృష్టి ఆకర్షించింది ఆకుల సోనియా. రెడ్ కలర్ ఔట్‌ఫిట్‌లో ఎంట్రీ ఇచ్చిన సోనియాకి వచ్చీ రాగానే బిస్కెట్ వేశారు నాగార్జున. నీ స్మయిల్ చాలా బావుందంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. అంతేకాకుండా ఆమెకి ఓ సర్‌ప్రైజ్ కూడా ఇచ్చారు. స్క్రీన్ మీద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఆమె కోసం […]
ప్రధానాంశాలు:
Sonia Akula : ఆకుల సోనియా బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. వర్మ టూ బిగ్ బాస్ ప్రయాణం ఎలా ?
Sonia Akula : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం ఎట్టకేలకి ప్రారంభం అయింది.ఈ షోలో 14 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు.అయితే వీరిలో అందరి దృష్టి ఆకర్షించింది ఆకుల సోనియా. రెడ్ కలర్ ఔట్‌ఫిట్‌లో ఎంట్రీ ఇచ్చిన సోనియాకి వచ్చీ రాగానే బిస్కెట్ వేశారు నాగార్జున. నీ స్మయిల్ చాలా బావుందంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. అంతేకాకుండా ఆమెకి ఓ సర్‌ప్రైజ్ కూడా ఇచ్చారు. స్క్రీన్ మీద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఆమె కోసం పంపిన వీడియోను ప్లే చేశారు. నటనలో నువ్వేంటో ప్రూవ్ చేసుకున్నావ్.. ఇప్పుడు హౌస్‌లో కూడా నీ టాలెంట్ చూపిస్తావని నమ్ముతున్నాను. నువ్వు ఖచ్చితంగా టైటిల్ గెలుస్తావ్.. త్వరగా గెలిచి వచ్చే మనం పార్టీ చేసుకుందాం అంటూ ఆర్జీవీ అన్నారు. మంథని ప్రాంతానికి చెందిన సోనియా మంచి సోషల్ వర్కర్ కూడా.
Sonia Akula ఇది ప్రయాణం..
బిగ్ బాస్ స్టేజ్ పైకి అడుగు పెట్టిన సోనియా ఆకుల తాను కరాటే ఫైటర్ అని చెప్పి హోస్ట్ నాగార్జుతో పాటు అందరినీ షాకయ్యేలా చేసింది..రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘కరోనా వైరస్’, ‘ఆశ ఎన్ కౌంటర్’ సినిమాల్లో కీలక పాత్రలు చేసింది సోనియా. అంతకుముందు ‘జార్జ్ రెడ్డి’ మూవీలో హీరో చెల్లి పాత్రలో నటించింది. బీటెక్ పూర్తి చేసిన ఆమె తెలంగాణ జాగృతిలో ముఖ్య భూమిక పోషించింది.సోషల్ మీడియాలోనూ సోనియాకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె నెట్టింట షేర్ చేసే ఫొటోలకు నెటిజన్ల నుంచి లైక్స్, కామెంట్ల వర్షం కురుస్తూ ఉంటుంది.
ఇక నామినేషన్‌లోను సోనియా అదరగొడుతుంది. నామినేషన్ ప్రక్రియలో సోనియా రెచ్చ గొడితే.. ప్రేరణ ఆ ట్రాప్‌లో పడిందా? అనే విధంగా కనిపించింది. ఈ వాదన సందర్భంగా వారి యాటిట్యూడ్ ఇంత దారుణంగా ఉంటుందా? అనే విధంగా కనిపించింది. ఇదే పరిస్థితి మణికంఠలోను కనిపించింది. వర్మ స్కూల్ నుంచి వస్తుంది కాబట్టి బిగ్‌బాస్ టీమ్ కూడా సోనియాని బాగానే చూసుకుంటారు. ఎందుకంటే గతంలో వర్మ స్కూల్ నుంచి వచ్చిన అరియానాకి రెండు సార్లు బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టే ఛాన్స్ దక్కింది. ఇక అషూ రెడ్డి కూడా బిగ్‌బాస్ హౌస్‌లో గట్టిగానే పెర్ఫామెన్స్ ఇచ్చింది. దీంతో సోనియా ఆకుల మీద ఆడియన్స్ గట్టిగానే నమ్మకం పెట్టుకున్నారు.మరి సోనియా వారి అంచనాలు అందుకుంటుందో లేక అరియానా, అషూ రెడ్డిలా అందాల ఆరబోతకే పరిమితమైపోతుందో చూడాలి.