Sonu Sood : ఇంటి ఆవరణలోకి వచ్చిన పాము.. భయం లేకుండా సోనూసూద్ అలా పట్టేసుకున్నాడేంటి.. వీడియో?
ప్రధానాంశాలు:
Sonu Sood : ఇంటి ఆవరణలోకి వచ్చిన పాము.. భయం లేకుండా సోనూసూద్ అలా పట్టేసుకున్నాడేంటి..?
Sonu sood : సినిమాల్లో విలన్ పాత్రలతో ఆకట్టుకున్నా… రియల్ లైఫ్‌లో మాత్రం హీరో మాదిరి సేవలు చేస్తూ కోట్లాది మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు నటుడు సోనూసూద్. కోవిడ్ సంక్షోభంలో ఆయన చేసిన సహాయ కార్యక్రమాలను మరచిపోలేం. ఇప్పటికీ ‘సోనూసూద్ ఫౌండేషన్’ ద్వారా నిరంతరంగా మానవ సేవలు అందిస్తున్నారు.

Sonu Sood : ఇంటి ఆవరణలోకి వచ్చిన పాము.. భయం లేకుండా సోనూసూద్ అలా పట్టేసుకున్నాడేంటి.. వీడియో?
Sonu sood : రియల్ హీరో..
తాజాగా ముంబైలోని సోనూ నివసించే అపార్ట్‌మెంట్ సొసైటీకి ఓ పాము వచ్చింది. ఆ పాము కనిపించగానే అక్కడి నివాసితులు భయంతో పరుగులు తీశారు. కానీ సోనూసూద్ మాత్రం చకచకా ముందుకు వెళ్లి, జాగ్రత్తగా తన చేతులతో ఆ పామును పట్టుకున్నారు. అది విషపూరితమైనది కాదని, రాట్స్‌నేక్ అని గుర్తించారు.అంతేగాక, స్థానికులకు పాముల గురించి అవగాహన కల్పిస్తూ,“ఇలాంటి పరిస్థితుల్లో అత్యుత్సాహం చూపకండి. నిపుణులను పిలిచి సహాయం తీసుకోండి. నాకు కొద్దిగా అనుభవం ఉంది కాబట్టే ఇలా పట్టుకున్నాను అని చెప్పుకొచ్చాడు.
ఆ తర్వాత పామును ఓ సంచిలో వేసి, అటవీ ప్రాంతంలో వదిలేయాలంటూ తన సిబ్బందిని ఆదేశించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను సోనూసూద్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. హర హర మహాదేవ్” అనే క్యాప్షన్‌తో పోస్టు చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు లక్షలాది వ్యూస్, షేర్లు, లైకులు వచ్చాయి. నెటిజన్లు, సినీ అభిమానులు సోనూసూద్ ధైర్యాన్ని, మూగజీవాలపై ఆయన చూపిన ప్రేమను చూసి ‘‘మీరు నిజమైన హీరో సార్!’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
పామును పట్టిన #sonusood
తన ఇంటి ప్రాంగణం వద్ద కనిపించిన పామును పట్టి సంచీలో వేశారు, ఆ పాము సంచిని తన సిబ్బందికి ఇచ్చి దానిని బయట వదిలేయమని చెప్పారు.
ఒక స్టార్ ఇలా పామును పట్టుకోవడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. pic.twitter.com/7rc6Z3itJB
— greatandhra (@greatandhranews) July 19, 2025