Sonu Sood : సీఎం, డిప్యూటీ సీఎం ఆఫర్లు కాదన్న సోనూ సూద్.. కారణాలు అవేనా లేక ఇంకేమైనా ఉన్నాయా..?
ప్రధానాంశాలు:
Sonu Sood : సీఎం, డిప్యూటీ సీఎం ఆఫర్లు కాదన్న సోనూ సూద్.. కారణాలు అవేనా లేక ఇంకేమైనా ఉన్నాయా..?
Sonu Sood : సమాజ సేవ చేయడానికి ఎలాంటి అధికారం లేదా పదవి అవసరం లేదని ప్రూవ్ చేశారు నటుడు సోనూ సూద్. సౌత్ లో ముఖ్యంగా తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన సోనూ సూద్ కరోనా టైం లో సమాజ సేవలో తన మంచి హృదయాన్ని చాటుకున్నాడు. బాలీవుడ్, టాలీవుడ్ ఏ స్టార్ హీరో కూడా చేయలేనన్ని మంచి పనులు తన వల్ల తన టీం తో చేశాడు సోనూ సూద్. తెర మీద విలన్ గా చేసిన సోనూ సూద్ హృదయం ఇంత గొప్పదా అనిపించేలా చేశాడు. ఐతే సోనూ సూద్ చేస్తున్న సేవా కార్యక్రమాల వెనక ఏదైనా రాజకీయ ఆకాంక్ష ఉందని కొందరు చెప్పుకొచ్చారు. దేశం మొత్తం కాశీ నుంచి కన్యాకుమారి వరకు సోనూ సూద్ చేసే సేవా కార్యక్రమాల గురించి తెలుసు. అతను ఈ ఇమేజ్ తో ఏ పార్టీలో చేరి ఓట్ల కోసం వెళ్లినా డబుల్ మెజారిటీతో గెలుస్తాడు.
Sonu Sood పదవిలో ఉంటేనే సేవ చేయొచ్చు..
కానీ సోనూ సూద్ అలా చేయలేదు. అంతేకాదు లేటేస్ట్ గా ఆయన సంచలన విషయాలను వెల్లడించాడు. తనకు ఏకంగా సీఎం, డిప్యూటీ సీఎం, రాహ్యసభ సభ్యుడి ఆఫర్లు వచ్చాయని కానీ వాటిని తాను తిరస్కరించానని అన్నారు సోనూ సూద్. ముందు చెప్పినట్టుగా ఏదైనా పదవిలో ఉంటేనే సేవ చేయొచ్చు అనేది అందరు చెప్పే మాట. కానీ సోనూ సూద్ అలా పదవుల కోసం.. పదవులో ఉండే సేవ చేయట్లేదు.
సోనూ సూద్ కి సీఎం ఆఫర్ వచ్చినా చేయనని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పాడు. దానితో మరోసారి అతని గొప్ప మనసు గురించి అందరు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా సోనూ సూద్ రోజు రోజుకి తన కార్యక్రమాలు.. ఆలోచనలతో ప్రజలకు మరింత దగ్గరవుతున్నారు. సోనూ సూద్ చేస్తున్న సేవల కోసం అతని ఆఫీస్, ఇంటి కార్యాలయాల చుట్టూ వేల కొద్దీ ప్రజలు తిరుగుతారని తెలిసిందే. ఐతే తనకు సాధ్యమైనంతవరకు సాయం చేస్తూ సోనూ సూద్ ప్రజలకు అండగా ఉంటూ వస్తున్నాడు.