Prabhas Spirit : ప్రభాస్ స్పిరిట్ కోసం సౌత్ కొరియా విలన్.. రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి మెంటల్ మాస్ అప్డేట్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Prabhas Spirit : ప్రభాస్ స్పిరిట్ కోసం సౌత్ కొరియా విలన్.. రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి మెంటల్ మాస్ అప్డేట్..!

Prabhas Spirit : రెబల్ స్టార్ ప్రభాస్ కల్కితో మరోసారి బాక్సాఫీస్ పై తన స్టామినా ఏంటో ప్రూవ్ చేశాడు. ప్రభాస్ కల్కి తో 1000 కోట్ల మార్క్ టచ్ చేశాడు. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రెండు డిఫరెంట్ షేడ్స్ లో ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేశాడు. వైజయంతి మూవీస్ ఏ నమ్మకంతో అయితే సినిమా చేసిందో అదే నమ్మకంతో ఆడియన్స్ సినిమాను సూపర్ హిట్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :9 July 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Prabhas Spirit : ప్రభాస్ స్పిరిట్ కోసం సౌత్ కొరియా విలన్.. రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి మెంటల్ మాస్ అప్డేట్..!

  •  రెబల్ స్టార్ ప్రభాస్ కల్కితో మరోసారి బాక్సాఫీస్ పై తన స్టామినా ఏంటో ప్రూవ్ చేశాడు.

Prabhas Spirit : రెబల్ స్టార్ ప్రభాస్ కల్కితో మరోసారి బాక్సాఫీస్ పై తన స్టామినా ఏంటో ప్రూవ్ చేశాడు. ప్రభాస్ కల్కి తో 1000 కోట్ల మార్క్ టచ్ చేశాడు. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రెండు డిఫరెంట్ షేడ్స్ లో ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేశాడు. వైజయంతి మూవీస్ ఏ నమ్మకంతో అయితే సినిమా చేసిందో అదే నమ్మకంతో ఆడియన్స్ సినిమాను సూపర్ హిట్ చేశారు.

కల్కి మొదటి భాగం సెన్సేషనల్ హిట్ కాగా రెండో భాగానికి ఇంకా టైం పట్టేలా ఉంది. ఐతే ప్రభాస్ నుంచి నెక్స్ట్ రాజా సాబ్ సినిమా వస్తుంది. కల్కి తర్వాత వస్తున్న సినిమా కావడంతో రాజా సాబ్ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో సినిమా లాక్ చేసుకున్నాడు.

యానిమల్ డైరెక్టర్ నెక్స్ట్ లెవెల్ ప్లాన్ :

అర్జున్ రెడ్డి తో అదరగొట్టి కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో బాలీవుడ్ ని షేక్ చేసిన డైరెక్టర్ సందీప్ వంగ ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా కాస్టింగ్ విషయంలో బయటకు వచ్చిన లేటెస్ట్ న్యూస్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు సూపర్ ట్రీట్ అందిస్తుంది. సినిమాలో విలన్ గా సౌత్ కొరియా యాక్టర్ ని తీసుకుంటున్నాడట సందీప్ రెడ్డి వంగ.

Prabhas Spirit ప్రభాస్ స్పిరిట్ కోసం సౌత్ కొరియా విలన్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి మెంటల్ మాస్ అప్డేట్

Prabhas Spirit : ప్రభాస్ స్పిరిట్ కోసం సౌత్ కొరియా విలన్.. రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి మెంటల్ మాస్ అప్డేట్..!

సౌత్ కొరియన్ యాక్టర్ మాడోంగ్ సియోక్ ని ప్రభాస్ స్పిరిట్ కోసం సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. సౌత్ కొరియా నుంచి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన మా డాంగ్ సియోక్ ని ప్రభాస్ స్పిరిట్ కోసం స్క్రీనింగ్ చేస్తున్నాడట సందీప్ రెడ్డి వంగ. సో ఈ సినిమా చైనా, కొరియా లో కూడా రిలీజ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఇప్పటికే ప్రభాస్ పేరు హాలీవుడ్ లో మారుమోగుతుంటే ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్ క్రేజ్ సంపాదించడం పక్కా అని చెప్పొచ్చు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది