Kalki Sequel | క‌ల్కి సీక్వెల్‌పై నోరు విప్పిన నాగ్ అశ్విన్..ఇప్ప‌ట్లో వచ్చేలా లేదుగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kalki Sequel | క‌ల్కి సీక్వెల్‌పై నోరు విప్పిన నాగ్ అశ్విన్..ఇప్ప‌ట్లో వచ్చేలా లేదుగా..!

 Authored By sandeep | The Telugu News | Updated on :1 September 2025,1:00 pm

Kalki Sequel | డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ క‌ల్కి సీక్వెల్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న విష‌యం తెలిసిందే. ‘కల్కి 2898 AD’ సీక్వెల్.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన విజువల్ వండర్ ‘కల్కి 2898 ADకి సీక్వెల్‌గా రూపొంద‌నుంది. గతేడాది జూన్ 27న రిలీజై వరల్డ్ వైడ్‌గా దాదాపు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడు అందరి దృష్టి సీక్వెల్‌పైనే ఉంది.

#image_title

నాగ్ అశ్విన్ రియాక్షన్

తాజాగా ‘కల్కి’ సీక్వెల్‌పై డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఓ పాడ్ కాస్ట్‌లో మాట్లాడుతూ.. ఈ ఏడాది చివర్లో ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లే ఛాన్స్ ఉందని తెలిపారు. ‘ఈ ఏడాది చివరి నాటికి కల్కి సీక్వెల్‌కు సంబంధించి షూటింగ్ ప్రారంభించాలని అనుకుంటున్నాం. ఫస్ట్ పార్ట్‌ను మించి సెకండ్ పార్ట్ ఉంటుంది. యాక్టర్స్ అందరూ కలిసి రావాలి. వారి డేట్స్ కుదరాలి. అందరూ బిజీగా ఉన్నారు. కొన్ని ప్రీ విజువలైజ్డ్ సీక్వెన్స్, యాక్షన్ సీక్వెన్స్ చాలా పెద్దవి. కాబట్టి వీటికి కొంత టైం పడుతుంది. నా దగ్గర కచ్చితమైన ఆన్సర్ అయితే లేదు.’ అని చెప్పారు.

షూటింగ్‌కు కొంత సమయం పడుతుందని… పోస్ట్ ప్రొడక్షన్‍‌కు ఎక్కువ టైం పడుతుందని నాగ్ అశ్విన్ తెలిపారు. ‘ఇంకో 2 లేదా మూడేళ్లలో అదే నేను అనుకుంటున్నా.’ అంటూ చెప్పడంతో ప్రభాస్‌ను కర్ణుడిగా సిల్వర్ స్క్రీన్‌పై చూడాలంటే చాలా టైం వేచి ఉండక తప్పేలా లేదు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది