
Sreeja Konidela Enjoys Cooking in her recent post
Sreeja Konidela : శ్రీజ కొణిదెల ప్రస్తుతం భర్తకు దూరంగా ఉంటోంది. ఈ విషయం అధికారికంగా ఎక్కడా చెప్పలేదు. కానీ అందరికీ అర్థమయ్యేలా శ్రీజ చేసింది. తన పేరులోని కళ్యాణ్‌ని తీసేసి కొణిదెలను యాడ్ చేసుకుంది. అలా శ్రీజ కళ్యాణ్ అంటూ ఉండే ఇన్ స్టాగ్రాం ఐడీ కాస్త.. శ్రీజ కొణిదెలగా మారింది. దీంతో అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి. అసలే అంతకు ముందు నుంచి కూడా కళ్యాణ్ దేవ్ కనిపించడం లేదని, మెగా ఫ్యామిలీ ఫోటోల్లో కనిపించడం లేదని అందరూ అడుగుతుండేవారు. కానీ శ్రీజ అలా తన పేరుని మార్చినప్పటి నుంచి అనుమానాలు మరింత బలపడ్డాయి.
దీంతో శ్రీజ, కళ్యాణ్ మధ్య మనస్పర్థలు వచ్చాయని, ఇద్దరూ విడిపోయారని, పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకుంటున్నారనే వాదనలు తెర మీదకు వచ్చాయి. అయితే శ్రీజ, కళ్యాణ్ దేవ్‌లు మాత్రం తమ కూతురు నవిష్కకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తుంటారు. శ్రీజ దగ్గరే నవిష్క ఉన్నట్టు కనిపిస్తోంది. శ్రీజ షేర్ చేసే ఫోటోలే కళ్యాణ్ దేవ్ కూడా షేర్ చేస్తుంటాడు. ఎందుకంటే నవిష్కకు సపరేట్‌గా ఇన్ స్టా ఖాతా కూడా ఉంది. అలా నవిష్కకు సంబంధించిన విషయాలు కళ్యాణ్ దేవ్‌కు తెలిసి వస్తున్నట్టున్నాయ్. మొత్తానికి శ్రీజ, కళ్యాణ్ దేవ్‌లు మాత్రం ఒక చోట ఉండటం లేదని అర్థమవుతోంది.
Sreeja Konidela Enjoys Cooking in her recent post
అయితే తన సంసార జీవితం ఇలా అయిపోయిందన్న డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేందుకు శ్రీజ ఏవో కొన్ని వ్యాపాకాలను అలవాటు చేసుకుంటున్నట్టుంది. అందుకే ఆ మధ్య వెకేషన్లకు వెళ్లింది. కొన్ని రోజులు రామ్ చరణ్‌తో కలిసి ముంబైకి వెళ్లింది. ఇక ఈమధ్యే కిచెన్‌లో ఎక్కువ సమయాన్ని గడుపుతోంది. వెరైటీ వంటకాలను ట్రై చేస్తోంది. మామూలుగా అయితే శ్రీజ ఎక్కువగా వంటగదిలోకి వెళ్లదని, అంతగా వంటలు చేయదని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో కళ్యాణ్ దేవ్ చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు మాత్రం శ్రీజ వంటను వ్యాపకంగా మార్చుకుని బాధల్లోంచి బయటపడుతున్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి శ్రీజ మాత్రం ఇప్పుడు ఫుల్ హ్యాపీగానే ఉన్నట్టు తెలుస్తోంది.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.