Sreeleela : ఇలా అయితే నీకు ఫ్యాన్స్ గా ఉండలేము .. శ్రీలీల కి మొహం మీదే చెప్పేసిన వీరాభిమానులు !

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 5 February 2023, 8:00 pm

Sreeleela : ‘ పెళ్లి సందడి ‘ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది శ్రీ లీల. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమెకు వరుస బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వస్తున్నాయి. ఇటీవల మాస్ మహారాజా రవితేజ తో కలిసి ‘ ధమాకా ‘ సినిమాలో నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాలో శ్రీ లీల డ్యాన్స్, అందం ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. అందుకే శ్రీలీల బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను అందుకుంటుంది. శ్రీ లీలా మంచి పాత్రలో ఫుల్ లెన్త్ ఉన్న స్టార్ హీరోల సినిమాలో చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Sreeleela fans unsatisfied in these movie

Sreeleela fans unsatisfied in these movie

అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో శ్రీ లీలకు ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. కానీ ఈ సినిమాలో శ్రీ లీల సెకండ్ హీరోయిన్ గా నటిస్తుందని అంటున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. సెకండ్ హీరోయిన్గా శ్రీ లీల నటిస్తున్నట్లుగా దాదాపుగా కన్ఫర్మ్ అయింది. అయితే త్రివిక్రమ్ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉండడం కామన్. కానీ సెకండ్ హీరోయిన్ కు అంత ప్రాముఖ్యత ఉండదు. అత్తారింటికి దారేది సినిమాలో ప్రణీత పాత్ర, అలవైకుంఠపురంలో నివేత పెతు రాజ్ పాత్ర లకు అంత ప్రాముఖ్యత ఉండదు. కాబట్టి మహేష్ బాబు సినిమాలో శ్రీలీల పాత్ర కూడా అంతే ఉంటుందని కొందరు

Sreeleela fans unsatisfied in these movie

Sreeleela fans unsatisfied in these movie

అభిప్రాయపడుతున్నారు. మహేష్ బాబు సినిమాలో శ్రీలీలను చిన్న పాత్రలో చూపిస్తే అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఆమధ్య ఈ సినిమా నిర్మాతలు శ్రీ లీల సెకండ్ హీరోయిన్ కాదని, పూజా హెగ్డే కు సమానమైన పాత్ర చేస్తుందని తెలిపారు. నిజంగానే శ్రీ లీల ఇలాంటి పాత్ర చేస్తే ఆమె లైఫ్ మారిపోతుందని అభిమానులు అంటున్నారు. అలా కాదని త్రివిక్రమ్ గత సినిమాలలో సెకండ్ హీరోయిన్ పాత్రలా ఉంటే శ్రీ లీలకు బ్యాడ్ టైం వస్తుందని అంటున్నారు. ఇక ఈ పాత్రలో శ్రీ లీల అభిమానులను సంతృప్తి పరుస్తుందో లేదో చూడాలి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp