Sreeleela In Pushpa 2 : ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా అంటూ పుష్ప పార్ట్ వన్ సినిమా సమంత చిందులేసిన విషయం తెలుసు కదా. నిజానికి ఆ పాట ఆ సినిమాకు చాలా ప్లస్ అయింది. మరి.. సెకండ్ పార్ట్ లోనూ ఆమాత్రం ఊపు ఉండే పాట ఉండాలి కదా. అందుకే డైరెక్టర్ సుకుమార్.. ఒక పవర్ ఫుల్ సాంగ్ ను పుష్ప 2 లో పెట్టబోతున్నారు. ఆ పాటలో ఆడిపాడేది ఎవరో కాదు.. ట్రెండింగ్ హీరోయిన్ శ్రీలీల. ప్రస్తుతం శ్రీలీల టాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్ గా అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. అందుకే శ్రీలీలను సుకుమార్ సెలెక్ట్ చేసుకున్నట్టు తెలుస్తోంది.
పుష్ప 2 కోసం కావాలని పట్టుబట్టి శ్రీలీలను సుకుమార్ తీసుకున్నారట. స్పెషల్ సాంగ్ మామూలుగా ఉండదట. పుష్పలోని ఊ అంటావా పాట ఎంత ఫేమస్ అయిందో అంతకు మించి ఈ పాట ఫేమస్ అయ్యేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఈ పాటలో మాస్ స్టెప్పులు ఉండబోతున్నాయట. అసలే అల్లు అర్జున్.. మరోవైపు ట్రెండింగ్ హీరోయిన్ శ్రీలీల. ఇద్దరి కాంబోలో పాట అంటే అదిరిపోవాల్సిందే కదా.ఒకవేళ శ్రీలీలకు ఈ పాట మంచి బ్రేక్ ఇస్తే టాలీవుడ్, బాలీవుడ్ లో శ్రీలీలకు సినిమా అవకాశాలు పెరుగుతాయి. అందుకే శ్రీలీల ఈ స్పెషల్ సాంగ్ మీద చాలా హోప్స్ పెట్టుకుంది.
నిజానికి పుష్ప 2 సినిమా పాన్ ఇండియా సినిమా కావడంతో బాలీవుడ్ లోనూ శ్రీలీల ఈ పాటతో పరిచయం కాబోతోంది. బాలీవుడ్ జనాలు శ్రీలీలను ఆ పాటలో ఆదరిస్తే ఇక తనకు బాలీవుడ్ లోనూ తిరుగు ఉండదు. చూడాలి మరి ఈ పాట తనకు ఎంత బ్రేక్ ఇస్తుందో?
Banana - Apple : అరటిపండు ఎంతో మధురంగా ఉంటుంది. అంతేకాదు ఈ పండులో ఖనిజాలు విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.…
Kadaknath Chicken : నాటు కోళ్ళ పెంపకం ఇప్పుడు ఎంత లాభదాయకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు గ్రామాల్లో చిన్న, సన్నకారు…
Postal Scheme : కేంద్ర ప్రభుత్వానికి చెందిన తపాల వ్యవస్థ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. పూర్వం ఇది కేవలం…
Health Benefits : లోటస్ (తామర) ప్రధానంగా ఆసియాలో పండించే మొక్క. ఈ మొక్క యొక్క భాగాలు మరియు దాని…
Vastu Tips : పురాణాల ప్రకారం దేవునితో పాటుగా పశుపక్షాధులను దైవంగా భావిస్తారు. అలాగే హిందూమతంలో వాటిని పూజించే సాంప్రదాయం…
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్‌లో ఒక సంవత్సరం అప్రెంటీస్‌షిప్ శిక్షణ కోసం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే నవగ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహం బృహస్పతి. సంపదకు విజ్ఞానానికి విద్య…
Success Story : ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరు కాస్త సృజనాత్మకతతో ఆలోచిస్తున్నారు. నాలుగు రూపాయలు సంపాదించాలనే ఆలోచన ప్రతి…
This website uses cookies.