Sreemukhi appeared on stage three years later
Sreemukhi : బుల్లితెరపై కనిపించే క్రేజీ జంటలలో శ్రీముఖి-రవి జంట ఒకటి. వీరు ఏదైన షో హోస్ట్ చేస్తే రచ్చ మాములుగా ఉండదు. పటాస్ చాలా ఎపిసోడ్స్ ఈ ఇద్దరు కలిసి చేశారు. ఎంత అన్యోన్యంగా ఉండే ఈ జంట సడెన్‌గా ఇలా విడిపోవడం అందరికి షాకిచ్చింది. ఆ మధ్య శ్రీముఖి బిగ్ బాస్ షోకి వెళ్లినప్పుడు తనను ఒకరు మోసం చేసారని.. పెళ్లి వరకు వచ్చిన తర్వాత అతడి గురించి ఓ దారుణమైన నిజం తెలిసిందని చెప్పింది శ్రీముఖి. దాంతో రవితో రిలేషన్ గురించే ఇన్ డైరెక్టుగా శ్రీముఖి చెప్పిందనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో జోరుగా జరిగింది. సమ్‌థింగ్ స్పెషల్’ అనే ప్రోగ్రాం ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న
రవి ఆ తర్వాత శ్రీముఖితో కలిసి చేసిన పటాస్ షోతో మరింత ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. స్టేజ్‌పై వీరిద్దరి టైమింగ్, కెమిస్ట్రీకి ఎంతోమంది అభిమానులున్నారు. మూడేళ్లుగా ఈ ఇద్దరు కలిసి ఒకే స్టేజ్‌పై కనిపించింది లేదు. బిగ్‌బాస్ మహోత్సవం అనే ఓ షో కోసం వీరిద్దరిని కలిసి ఒకే స్టేజ్‌పై చూసే అవకాశం దక్కింది. తాజాగా బిగ్ బాస్ మహోత్సవం ప్రోమో విడుదల కాగా, ఇందులో శ్రీముఖి ఎంట్రీ చూసి రవి షాక్ అయి అలా ఉంటాడు. ఇది చూసి శ్రీముఖి పంచ్ వేసింది.నువ్వు బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నప్పుడు, బిగ్ బాస్ నిన్ను ఎలిమినేట్ చేసినప్పుడు అయిన షాక్ కంటే ఇది పెద్ద షాక్ కాదులే అని శ్రీముఖి సెటైర్ వేసింది. ఇక కాజల్ కి ఛాన్స్ ఇస్తే షో మొత్తం ఆమెనే చేసేస్తుంది అని పేర్కొంది.
Sreemukhi appeared on stage three years later
ఇక హౌజ్ మేట్స్ అందరు సరదాగా, సంతోషంగా చిందులు వేయగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగహల్ చల్ చేస్తుంది. మూడేళ్ల తర్వాత రవి శ్రీముఖిని ఇలా కలిసి చూడడం సంతోషంగాఉందని నెటిజన్స్ అంటున్నారు. ఆ మధ్య ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూకి వెళ్లిన రవికి శ్రీముఖితో ఎఫైర్ గురించి ప్రశ్నలు రావడంతో సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. ‘మీరు యాంకర్ శ్రీముఖితో డేటింగ్‌లో ఉన్నారట.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారట.. నిజమేనా? అంటూ యాంకర్ ప్రశ్నలు అడగడంతో.. ‘హా!! అవునండీ మా ఇద్దరికీ పిల్లలు కూడా పుట్టేశారు. ఒక హాస్టల్‌లో ఉంటూ టెన్త్ చదువుతున్నాడు. మాట్లాడటానికి కాస్తైనా కామన్‌సెన్స్ ఉండాలి’ అంటూ ఘాటుగా స్పందించారు రవి.
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్‌లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
This website uses cookies.