Sreemukhi : ఎవరెవరినో పెట్టుకుంటావ్.. నన్ను పెట్టుకోవాలనిపించలేదా.. అవినాశ్‌ను అడిగిన శ్రీముఖి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sreemukhi : ఎవరెవరినో పెట్టుకుంటావ్.. నన్ను పెట్టుకోవాలనిపించలేదా.. అవినాశ్‌ను అడిగిన శ్రీముఖి

Sreemukhi: ఎంటర్‌టైన్మెంట్‌కు కేరాఫ్‌గా ఉండేందుకుగాను స్టార్ మా వారు డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నారు. ‘బిగ్ బాస్’ కోసం ప్రేక్షకులు స్టార్ మాను చూస్తూనే ఉండగా, ఇంకొంత వినోదం పంచేందుకుగాను ‘కామెడి స్టార్స్’ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ప్రసారమయ్యే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను స్టార్ మా వారు ట్విట్టర్ వేదికగా షేర్ చేయగా, అది ఆకట్టుకుంటోంది. ‘ఒక టికెట్ మీద ఆరు ఫన్నీ స్టోరిస్..మీకు తప్పకుండా వినోదం అందిస్తాం’ అనే క్యాప్షన్ తో కామెడి […]

 Authored By mallesh | The Telugu News | Updated on :29 September 2021,8:50 pm

Sreemukhi: ఎంటర్‌టైన్మెంట్‌కు కేరాఫ్‌గా ఉండేందుకుగాను స్టార్ మా వారు డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నారు. ‘బిగ్ బాస్’ కోసం ప్రేక్షకులు స్టార్ మాను చూస్తూనే ఉండగా, ఇంకొంత వినోదం పంచేందుకుగాను ‘కామెడి స్టార్స్’ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ప్రసారమయ్యే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను స్టార్ మా వారు ట్విట్టర్ వేదికగా షేర్ చేయగా, అది ఆకట్టుకుంటోంది. ‘ఒక టికెట్ మీద ఆరు ఫన్నీ స్టోరిస్..మీకు తప్పకుండా వినోదం అందిస్తాం’ అనే క్యాప్షన్ తో కామెడి స్టార్ ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోగ్రాం సండేను ఫన్ డేగా మార్చేస్తుందని పేర్కొన్నారు.

Sreemukhi asked avinash in star comdey star

Sreemukhi asked avinash in star comdey star

Sreemukhi : సింగిల్ టికెట్‌పై ఆరు ఫన్నీ స్టోరిలు..

ఇకపోతే ‘జబర్దస్త్’ ప్రోగ్రాం మాదిరిగానే ఈ షోలోనూ ఆరుగురు టీమ్‌గా ఫామ్ అయి ఫన్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈ షోకు జడ్జిలుగా శేఖర్ మాస్టర్, శ్రీదేవి విజయ్ కుమార్ వ్యవహరిస్తున్నారు. ముక్కు అవినాశ్ స్కిట్‌లో అవినాశ్ పంచ్ డైలాగ్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ షోలో కొత్త వారిని తన స్కిట్ ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తుండగా, తనను ఎందుకు స్కిట్‌లో పెట్టుకోవడం లేదని శ్రీముఖి ముక్కు అవినాశ్‌ను అడుగుతుంది.

sekhar master and sreemukhi insta reel video

sekhar master and sreemukhi insta reel video

దానికి కౌంటర్‌గా అవినాశ్ తనకు శ్రీముఖి ఆడపిల్లలా కనబడలేదని చెప్పి నవ్వులు పూయించినట్లు ప్రోమో ద్వారా తెలుస్తోంది. ఇకపోతే శ్రీముఖి తనను ఆడపిల్ల కాదని ముక్కు అవినాశ్ అనడంతో అతడిని కొట్టి తన యాంకరింగ్ పొజిషన్‌లోకి వెళ్లిపోతుంది. ఇక హరి, అశు పర్ఫార్మెన్స్ కూడా అదిరిపోయింది ప్రోమోలో. సద్దాం తన స్కిట్‌లో తాను పెద్ద పెద్ద వాళ్లకు యాక్టింగ్ నేర్పించినట్లు చెప్తాడు. అది నిజమే అనుకున్న శ్రీముఖి వారు ఎవరో అని అడగ్గా.. 90 ఏళ్లకు పైబడిన వారు అని చెప్పి ఫన్నీ బాంబ్ పేల్చాడు సద్దాం. దాంతో శ్రీముఖి సద్దాంను కొట్టేస్తుంది.

Sreemukhi About Her Break up And Boy friend

Sreemukhi About Her Break up And Boy friend

ఇక చివరగా ‘చల్తీకా నామ్ గాడీ హై… చెమటోడిస్తే రోటీ హై’ అన్న పాటకు జడ్జిలు, షోలో పాల్గొన్న వారు అందరూ హుషారుగా స్టెప్స్ వేశారు. శేఖర్ మాస్టర్, శ్రీదేవి విజయ్ కుమార్ జంటగా డ్యాన్స్ చేశారు. చివరలో హరి స్టేజిపై నుంచి కింద పడ్డట్లు చూపించి ఎపిసోడ్‌పై మరింత ఇంట్రెస్ట్ కలిగేలా చేశారు. ప్రతీ ఆదివారం 1.30 గంటలకు ఈ ‘కామెడి స్టార్స్’ ప్రోగ్రాం టెలికాస్ట్ అవుతుంది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది