Sreemukhi : శ్రీముఖికి బాలీవుడ్ హీరో అంత‌లా ముద్దులు పెట్టాడేంటి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sreemukhi : శ్రీముఖికి బాలీవుడ్ హీరో అంత‌లా ముద్దులు పెట్టాడేంటి..!

Sreemukhi : బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. యాంక‌ర్‌ని మించి పాపులారిటీ ద‌క్కించుకుంది. యాంక‌ర్‌గా, న‌టిగా, బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా ఇలా శ్రీముఖి క్రేజ్ పెరుగుతూ పోయింది. చాలా కాలం క్రితమే ఇండస్ట్రీకి పరిచయమైన ఆమె.. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి టాప్ యాంకర్‌గా ఎదిగిపోయింది. దీంతో రెండు రంగాల్లోనూ తనదైన ముద్రను వేస్తోంది. అదే సమయంలో యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలోనూ విపరీతంగా సందడి చేస్తుంది. రీసెంట్‌గా […]

 Authored By sandeep | The Telugu News | Updated on :13 September 2022,4:30 pm

Sreemukhi : బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. యాంక‌ర్‌ని మించి పాపులారిటీ ద‌క్కించుకుంది. యాంక‌ర్‌గా, న‌టిగా, బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా ఇలా శ్రీముఖి క్రేజ్ పెరుగుతూ పోయింది. చాలా కాలం క్రితమే ఇండస్ట్రీకి పరిచయమైన ఆమె.. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి టాప్ యాంకర్‌గా ఎదిగిపోయింది. దీంతో రెండు రంగాల్లోనూ తనదైన ముద్రను వేస్తోంది. అదే సమయంలో యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలోనూ విపరీతంగా సందడి చేస్తుంది. రీసెంట్‌గా శ్రీముఖి `సైమా2022` లోనూ యాంకర్‌గా చేసింది. కమెడియన్‌ అలీతో కలిసి సౌత్ ఇండియ‌న్ సినిమాల‌కు సంబంధించిన కార్య‌క్ర‌మ‌లో ఆమె యాంకరింగ్‌ చేసింది.

బ్లాక్‌ ట్రెండీ వేర్‌లో రచ్చ చేసింది. హోయలు పోతూ అవార్డు వేడుకలో మొత్తం హైలైట్‌గా నిలిచింది. అయితే ఓ సంద‌ర్భంలో ర‌ణ్‌వీర్ సింగ్ స్టేజ్ మీద‌కు రాగా, అమ్మాయిలంతా జెలసీ ఫీలయ్యేలా మీరు ఒకటి చేయాలని తెలిపింది. దీంతో రెచ్చిపోయిన రణ్‌వీర్‌ సింగ్‌ ఆమెకి హగ్గులిచ్చారు. అంతటితో ఆగలేదు ముద్దులతో ముంచెత్తాడు. శ్రీముఖి రెండు చేతులకు ముద్దులివ్వడం విశేషం. దీంతో ఆలీ పంచ్‌లు కూడా వేశాడు. దీపికా పదుకొనె చూస్తున్నావా? అంటూ అలీ వేసిన పంచ్‌లో నవ్వులు పూయించాయి. ప్రస్తుతం ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది శ్రీముఖి. ఇప్పుడు ఏం జరిగింది? అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ, రణ్‌వీర్‌ సింగ్‌కి లవ్యూ చెప్పింది యాంకర్‌.

Sreemukhi full happy with that

Sreemukhi full happy with that

Sreemukhi : అలా ఎలా?

దీనికి కారణమైన సైమాకి థ్యాంక్స్ చెప్పింది. శ్రీముఖి త‌న క్రేజ్‌ని పెంచుకుంటూ పోతుంది. ఈటీవీ, మా టీవీ, జెమినీ, జీ తెలుగు ఇలా ఛానెల్‌తో సంబంధం లేకుండా వరుసగా వినోదాత్మక షోలకు యాంకర్‌గా చేస్తుంది. ప్రస్తుతం ఆమె చేస్తున్న వాటిలో `జాతిరత్నాలు`, `సరిగమప` ప్రధానంగా ఉండగా, కొత్తగా `డాన్సు ఐకాన్‌` ప్రారంభమైంది. వీటితోపాటు సండే స్పెషల్‌ ఈవెంట్లలోనూ యాంకర్‌గా చేస్తూ ఫుల్‌ బిజీగా ఉందీ. మ‌రో వైపు వెండితెర‌పై కూడా అడ‌పాద‌డ‌పా సంద‌డి చేస్తూనే ఉంది. ప్రస్తుతం చిరంజీవితో `భోళాశంకర్‌` సినిమా చేస్తుంది. ఇందులో శ్రీముఖి పాత్ర చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంద‌ని స‌మాచారం.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది