Sreemukhi : కుందనపు బొమ్మ అవతారమెత్తిన శ్రీముఖి.. ఆ చీరకట్టులో మతిపోగొడుతోందిగా!

Authored By mallesh | The Telugu News | Published on: September 16, 2022, 5:30 pm

Sreemukhi : బుల్లితెర యాంకర్ శ్రీముఖి ఒక్కసారిగా తన అవతారం మార్చింది. మొన్నటివరకు ఫ్యాషన్ దుస్తుల్లో మెరిసిన ఈ అందాల బొమ్మ ఒక్కసారిగా సంప్రదాయ దుస్తుల్లో తళుక్కుమని మెరిసింది. చీరకట్టులో శ్రీముఖి అందాన్ని చూసిన వారంతా ఫిదా అవుతున్నారు.ఇంత అందం ఇన్నాళ్లు ఎందుకు దాచి ఉంచావని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. బుల్లితెర హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి ఈ మధ్యకాలంలో చాలా బిజీగా మారిపోయింది. మంచి మంచి షోలు ప్రసారానికి రెడీ అవుతుండగా.. అందులో చేయాలని శ్రీముఖికి కాల్స్ కూడా వస్తున్నాయని టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం మా, జీ చానెళ్లలో వచ్చే కామెడీ ప్రోగ్రాంకు శ్రీముఖి యాంకరింగ్ చేస్తోంది. పటాస్ షోలో రవి, శ్రీముఖి పెయిర్ చాలా బాగా సూట్ అయ్యింది. వీరి రన్నింగ్ కామెంటరీ, కమెడియన్ల పంచుల ఆమెకు మంచి పేరును తీసుకొచ్చాయి. నిజామాబాద్ వాస్తవ్యురాలు అయిన శ్రీముఖి.. బుల్లితెర యాంకర్‌గా మంచి గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. అప్పుడప్పుడు సినిమాల్లో మెరిసిన శ్రీముఖి ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు.

sreemukhi latest photos on instagram

sreemukhi latest photos on instagram

Sreemukhi : చీరకట్టులో బుట్టబొమ్మలా ఉందంట..

నేను శైలజ, జులాయి సినిమాల్లో చిన్నరోల్స్ చేసిన శ్రీముఖి.. ప్రస్తుతం టాప్ యాంకర్స్ లిస్టులో చోటు సంపాదించుకుంది. బుల్లితెర షోలు, ఈవెంట్స్, ఆడియో ఫంక్షన్స్‌తో బిజీబిజీగా గడుపుతున్న శ్రీముఖి.. ఓంకార్ ప్రారంభించిన ఒక షోలో జడ్జిగా కూడా వ్యవహరిస్తోందట. దీనికి తోడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే శ్రీముఖి.. తాజాగా సోషల్ మీడియోల్ షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. పింక్ అండ్ బ్లూ సారీలో బుట్టబొమ్మలాగా దర్శనమిచ్చింది శ్రీముఖి.. బిగుతైన అందాలతో సంప్రదాయకంగా కనిపించి అందరినీ మెస్మరేజ్ చేసింది ఈ అల్లరి యాంకర్.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp